మంత్రి శ్రీ నారా లోకేష్ ను కలిసిన శ్రీశైలం ఎమ్మెల్యే శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి గారు.*

0
627

 

రాష్ట్ర విద్యా, ఐటీ, హెచ్.ఆర్.డి మరియు ఆర్.టి.జి శాఖల మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారిని అమరావతి (ఉండవల్లి )లోని వారి స్వగృహం నందు శుక్రవారం ఉదయం శ్రీశైలం ఎమ్మెల్యే శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి గారు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. 

 

ఈ సందర్భంగా శ్రీశైలం మండలంలో శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ బిసి హాస్టల్, పాలిటెక్నిక్, ఐ.టి.ఐ కళాశాలల నందు హాస్టల్ వసతి, భోజన శాల, తరగతి గదుల మరమ్మత్తులు, మౌలిక వసతుల కల్పన, అంతర్గత రహదారుల నిర్మాణం, త్రాగునీటి సదుపాయం ఏర్పాటికై వినతి..

 

అలాగే శ్రీశైలం నియోజవర్గంలో యువ గళం పాదయాత్ర సందర్భంగా శ్రీ లోకేష్ గారు ఆనాడు ఇచ్చిన హామీ.. ప్రతి చెంచు కుటుంబానికి ఇళ్లు నిర్మించి అందించే అంశంపై కూడా ఎమ్మెల్యే శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి గారు మంత్రి శ్రీ నారా లోకేష్ గారి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ అంశాలపై మంత్రి శ్రీ లోకేష్ గారు సానుకూలంగా స్పందించారు. ఎమ్మెల్యే గారి వెంట నియోజకవర్గ టిడిపి నాయకులు యుగంధర్ రెడ్డి ఉన్నారు.

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: మద్యం మత్తులో డ్రైవ్ చేయడంతో ప్రమాదం.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని యుఎన్ఆర్ సర్కిల్ 42వ జాతీయ రహదారిపై చిత్తూరు నుంచి అనంతపురం...
By Kothuru Murali 2026-01-28 09:10:02 0 199
Sports
Premier League Title Race Pushed to the Absolute Wire
An absolute thriller is unfolding in the English Premier League as today’s high-stakes...
By Dunna Jessicaruth 2026-05-20 05:39:45 0 109
Telangana
నిజామాబాద్: పద్మశాలి సంఘం నూతనకమితి ప్రమాణ స్వికారం
నగరంలోని ఎల్లమ్మగుట్ట పద్మశాలి సంఘం ( తర్ప నం 32 ) నూతన కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో...
By Sadaq Sadaq 2026-04-22 13:26:46 0 174
Andhra Pradesh
పుంగనూరు: యువతకు క్రీడా వసతులు కల్పిస్తాం: చిన్న రాయల్
పుంగనూరు జనసేన పార్టీ ఇంచార్జ్ చిన్న రాయల్ యువతుకు మెరుగైన క్రీడా వసతులు కల్పిస్తామని తెలిపారు....
By Kothuru Murali 2026-04-21 14:38:46 0 135
West Bengal
West Bengal Strengthens Agriculture and Farmer Welfare
West Bengal continues to prioritize agriculture and farmer welfare through a range of initiatives...
By Fathima Safa 2026-06-25 11:13:40 0 106
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com