సాయి రెడ్డి కాలనీ రోడ్ నెంబర్ 10 - వీధి దీపాలు వెలగక తీవ్ర ఇబ్బంది పడుతున్న కాలనీవాసులు.

0
702

సాయి రెడ్డి కాలనీ రోడ్ నెంబర్ 10 – వీధి దీపాల సమస్యతో ఇబ్బందులు

 

అల్వాల్ సర్కిల్ పరిధిలోని 133వ డివిజన్, మచ్చబొల్లారం రోడ్ నెంబర్ 10, సాయి రెడ్డి కాలనీలో గత వారం రోజులుగా వీధి దీపాలు పనిచేయకపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.రాత్రివేళల్లో రోడ్లపై చీకటి కమ్ముకోవడంతో వాహనదారులు, పాదచారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి.కాలనీలోని మహిళలు, విద్యార్థులు, వృద్ధులు రాత్రి సమయంలో బయటకు రావడానికి భయపడుతున్నారు.చీకటి కారణంగా దొంగతనాలు,  అసాంఘిక సంఘటనలు జరిగే అవకాశం ఉందని కాలనివాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీధి దీపాలు మరమ్మతు చేయాలని పలుమార్లు విద్యుత్  అధికారులకు, లైన్ మెన్ లకు సమాచారం ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాలనీ ప్రజలు త్వరితగతిన సమస్యను పరిష్కరించి వీధి దీపాలను సరిచేయాలని జిహెచ్ఎంసి మరియు సంబంధిత విద్యుత్ శాఖ అధికారులను కోరుతున్నారు.

   -సిద్దుమారోజు 

Search
Categories
Read More
Telangana
తెలుగు సినీ పరిశ్రమకు పోలీసుల మద్దతు |
తెలుగు సినీ పరిశ్రమను రక్షించేందుకు హైదరాబాద్ పోలీసు శాఖ కీలకంగా ముందుకొచ్చింది. పైరసీపై...
By Bhuvaneswari Shanaga 2025-09-30 06:11:17 0 29
Telangana
బర్త్‌డే పార్టీలో గంజాయి.. మంగ్లీపై కేసు.
ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీపై కేసు నమోదు అయింది. మంగ్లీ పుట్టిన రోజు వేడుకల్లో గంజాయి వాడకం...
By Sidhu Maroju 2025-06-11 14:25:31 0 1K
BMA
BJP Declares June 25 as 'Samvidhan Hatya Diwas'
Union Home Minister Amit Shah and PM Modi termed the 1975 Emergency a “dark chapter”...
By Bharat Aawaz 2025-06-25 11:40:55 0 1K
West Bengal
Amit Mitra Counters Centre on Tax Growth |
Former West Bengal Finance Minister Amit Mitra has strongly responded to Union Finance...
By Bhuvaneswari Shanaga 2025-09-20 04:32:50 0 113
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com