శ్రీ బాలాజీ రాధాకృష్ణ మఠం భూమి, లీజును రద్దు చేయండి.

0
698

మేడ్చల్ మల్కాజిగిరి  జిల్లా/ అల్వాల్

అల్వాల్ సర్కిల్ భారతీయ జనతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీమతి కృష్ణవేణి కి కలిసి మచ్చ బొల్లారం డివిజన్ లోబాలాజీ రాధాకృష్ణ మఠం సర్వేనెంబర్ 91 లో ఉన్న ఒక ఎకరం 10 గుంటల భూమి ని ప్రైవేటు చారిటబుల్ ట్రస్ట్ కు లీజును రద్దు కొరకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగాా.. అల్వాల్ సర్కిల్ బిజెపి నాయకులు మాట్లాడుతూ.. అల్వాల్ సర్కిల్లోని మచ్చ బొల్లారం డివిజన్లో ఉన్న అతి పురాతనమైన శ్రీ బాలాజీ రాధాకృష్ణ మఠం ఆధీనంలో ఉన్న సర్వేనెంబర్ 91 లో ఉన్న 1 ఎకరం 10 గుంటల భూమిని ప్రైవేటు చారిటబుల్ ట్రస్ట్ కు 11 సంవత్సరాలు నామమాత్రపు నెలవారి అద్దెతో దేవాలయ ఆధీనంలో ఉన్న భూమిని ప్రైవేటు వ్యక్తుల స్వాధీనంలోకి పోతుందని తెలిపారు.  తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం హిందూ దేవాలయాలను, దేవాలయాల ఆస్తులను అన్యక్రాంతం  చేస్తున్నారని తెలిపారు.  శ్రీ బాలాజీ రాధాకృష్ణ మఠంలో ఆధీనంలో ఉన్న ఒక ఎకరం 10 గుంటల భూమిలో నూతనంగా కళ్యాణమండపం  నిర్మించి స్థానిక ప్రజలకు, భక్తులకు అందుబాటులో తేవాలని సూచించారు.  హిందూ భక్తుల ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ ప్రైవేటు వ్యక్తులకు ఇలా లీజును కొనసాగిస్తే దేవాలయ భూములపైన భారతీయ జనతా పార్టీ ప్రజా పోరాటం చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో అల్వాల్ సర్కిల్ భారతీయ జనతా పార్టీ మాజీ కౌన్సిలర్  నిమ్మ  కృష్ణారెడ్డి, మచ్చ బొల్లారం అధ్యక్షుడు అజయ్ రెడ్డి, అల్వాల్ డివిజన్ అధ్యక్షుడు కార్తీక్ గౌడ్, వెంకటాపురం డివిజన్ నాయకులు ఆంటోనీ రవి కిరణ్, శ్రీధర్ రెడ్డి, సీనియర్ నాయకులు మాచర్ల శ్రీనివాస్, సంజయ్ కుమార్, తూప్రాన్ లక్ష్మణ్, రాజిరెడ్డి, మహేంద్ర పాల్ సింగ్, అనిల్, సునీల్, కార్తీక్ రెడ్డి, భరత్, రాజు, అజయ్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

  -సిద్దుమారోజు ✍️

Search
Categories
Read More
Telangana
దూలపల్లి PACS కు ISO & HYM సర్టిఫికేషన్. అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్
దూలపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) ISO & HYM సర్టిఫికేషన్ అందుకున్న సందర్భంగా...
By Sidhu Maroju 2025-07-02 09:32:27 0 986
Bharat Aawaz
THE VOICE OF THE UNHEARD
Bharat Aawaz! THE VOICE OF THE UNHEARD This is the story of a movement. A movement to find,...
By Bharat Aawaz 2025-07-08 18:39:42 0 1K
Prop News
India’s Real Estate Needs a New Standard. Propiinn Delivers It.
The Problem We’re Solving: Why India Needs a Platform Like Propiinn The Indian real estate...
By Bharat Aawaz 2025-06-25 18:59:47 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com