వర్షంతో ఇబ్బందులు పడుతున్న బస్తీ వాసులను పరామర్శించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్

0
805

మల్కాజిగిరి జిల్లా/ కంటోన్మెంట్ 

 

ఈరోజు కంటోన్మెంట్ నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షానికి బస్తీలు కాలనీల లోకి వర్షపు నీరు చేరి ఇళ్ళలోకి కూడా రావడంతో ఆయా బస్తీ, కాలనీల వాసులు తీవ్ర ఇక్కట్లకు గురి అయ్యారు. ఇళ్ళలోకి నీళ్ళు వచ్చిన విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే శ్రీగణేష్ కార్ఖానా లోని నారాయణ స్వామి టెంపుల్ ఏరియాలో పర్యటించి అక్కడి ప్రజలను పరామర్శించారు.ఇళ్ళలోకి నీరు చేరడంతో ఇళ్ళలోని వస్తువులు నీట మునిగాయి.స్పందించిన ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించి తక్షణమే అక్కడికి పిలిపించుకుని ఇళ్ళలోకి వచ్చిన నీటిని బయటకు పంపించాలని, వారికి అవసరమైన సహాయాన్ని వెంటనే అందించాలని,ఏ అవసరం వచ్చినా నాకు సమాచారం ఇస్తే వెంటనే తక్షణ చర్యలు తీసుకుంటానని, ఎలక్ట్రిసిటీ, శానిటేషన్ సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని అధికారులకు సూచించారు.తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే శ్రీగణేష్ కు బస్తీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు.

#Sidhumaroju 

Search
Categories
Read More
Telangana
ఆరోగ్య బాగుకై అర్హులైన నిరుపేదలు ముఖ్యమంత్రి సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలి : బిఆర్ ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్.
కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే  నివాస కార్యాలయం వద్ద కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి పలువురు...
By Sidhu Maroju 2025-06-12 11:27:57 0 1K
Telangana
ఎం.పి.ఈటెల ప్రెస్ మీట్
 మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్   రైలు నిలయంలో సంబంధిత అధికారులందరితో...
By Sidhu Maroju 2025-05-31 06:03:45 0 1K
Andhra Pradesh
Unified Emergency Centre in AP | ఆంధ్రప్రదేశ్‌లో ఏకీకృత అత్యవసర కేంద్రం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడలో ఒక Unified Emergency Response & Command Centre (#UERCC)...
By Rahul Pashikanti 2025-09-10 07:09:44 0 20
Business
Cabinet Approves Employment Linked Incentive Scheme
Union Cabinet approves the Employment Linked Incentive (ELI) Scheme aimed at supporting job...
By Bharat Aawaz 2025-07-03 08:38:44 0 1K
Business EDGE
🌍 You Don’t Need To Be Big To Make A Big Impact
🌍 You Don’t Need To Be Big To Make A Big Impact Your Local Voice Can Create National...
By Business EDGE 2025-04-30 11:44:14 0 3K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com