శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ & ప్రెస్ మీట్

0
348

ఆనంద్ బాగ్ శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఆలయ అర్చకులు, అభివృద్ధి కమిటీ సభ్యులు శుక్రవారం నిర్వహించిన పత్రికా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు.

బ్రహ్మోత్సవాలు: ఆగస్టు 5, 2025 (మంగళవారం) నుండి ఆగస్టు 9, 2025 (శనివారం) వరకు ఐదు రోజుల పాటు జరుగుతాయి. ఆలయ కార్యనిర్వాహణాధికారి ఎ.బి. రవీందర్ రెడ్డి పర్యవేక్షణలో ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి.

ప్రధాన కార్యక్రమాలు:

ఆగస్టు 5: కోయిల అల్వార్ తిరుమంజనం, విష్ణు సహస్రనామ పారాయణం, పల్లకి సేవ, అంకురార్పణ.
ఆగస్టు 6: గరుడ హోమం.
ఆగస్టు 7: ఎదుర్కోళ్ళు, స్వామివారి కల్యాణ మహోత్సవం, హనుమత్ సేవ, రథోత్సవం.
ఆగస్టు 8: సుదర్శన హోమం, మహా పూర్ణాహుతి, చక్రస్నానం, వసంతోత్సవం, శ్రీ పుష్పయాగం.
ఆగస్టు 9: ఉత్సవాంత స్నపనం, ఆచార్య ఋత్విక్ సన్మానం.

ఆలయ ప్రధాన అర్చకులు ముడుంబై వెంకట రమణాచార్యులు మాట్లాడుతూ, ఆలయంలో పాంచరాత్ర ఆగమం ప్రకారం పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆలయ అర్చకులు, క్లార్క్, అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Fake Video Controversy | నకిలీ వీడియో వివాదం
CID (క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్) నాయుడు గారి డీప్‌ఫేక్ వీడియోపై కేసు నమోదు...
By Rahul Pashikanti 2025-09-10 11:13:35 0 25
Chandigarh
Chandigarh’s Speed Limit Signs Under Scanner After Major Errors Found
In a recent city-wide audit, the Chandigarh traffic police found alarming inconsistencies in...
By Bharat Aawaz 2025-07-17 06:12:19 0 1K
BMA
📰 Fact vs. Fake: How Journalists Can Fight Misinformation in the Digital Age
📰 Fact vs. Fake: How Journalists Can Fight Misinformation in the Digital Age In today’s...
By BMA (Bharat Media Association) 2025-05-28 06:20:42 0 2K
Telangana
Hyderabad Wins Buchi Babu Trophy | బుచ్చి బాబు ట్రోఫీ హైదరాబాదు విజయం
హైదరాబాదు జట్టు మరోసారి బుచ్చి బాబు ట్రోఫీని కైవసం చేసుకుంది. చెన్నైలో జరిగిన ఫైనల్ మ్యాచ్ డ్రాగా...
By Rahul Pashikanti 2025-09-10 05:07:25 0 16
Telangana
బిజెపి దుండిగల్ మున్సిపాలిటీ ఉపాధ్యక్షురాలుగా నడికట్ల రోజా నియామకం. నియామక పత్రాన్ని అందజేసిన పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్.
  మల్కాజిగిరి  జిల్లా కుత్బుల్లాపూర్ బిజెపి దుండిగల్ మున్సిపాలిటీ ఉపాధ్యక్షురాలు గా...
By Sidhu Maroju 2025-06-14 15:27:46 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com