కంటోన్మెంట్ బోర్డు సిఈఓ మధుకర్ నాయక్ తో ఎమ్మెల్యేశ్రీగణేష్ భేటీ

0
942

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కంటోన్మెంట్ బోర్డు సీఈవో మధుకర్ నాయక్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యి నియోజకవర్గం లోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో పలు అంశాలను ఎమ్మెల్యే సీఈఓ తో  చర్చించారు. ప్రధానంగా మర్రి రాంరెడ్డి కాలనీలో వర్షాకాలం నేపథ్యంలో ఎగువ ప్రాంతం నుండి వచ్చే వర్షపు నీటితో ముంపునకు గురవుతున్న తరుణంలో నాల విస్తరణ పనులు చేపట్టి ముంపు ప్రాంతాలకు విముక్తి కలిగించాలని అన్నారు. దోబీ ఘాట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ విషయంలో తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీకి కంటోన్మెంట్ నుండి లేఖ రాయడంపై జాప్యం చేయవద్దని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి చేసే అభివృద్ధి పనుల విషయంలో కంటోన్మెంట్ బోర్డు ఎన్ఓసి విధానాన్ని సడలించాలని కోరారు. తిరుమలగిరి చెరువు, బోయిన్ పల్లి రామన్న కుంట చెరువుల సుందరీ కరణ పనులు వేగవంతం చేయడంతో పాటు పాలనాపరమైన అనుమతుల విషయంలో జాప్యం లేకుండా చూడాలని సూచించారు. బొల్లారం కంటోన్మెంట్ ఆసుపత్రిలో వెటర్నరీ విభాగాన్ని ఏర్పాటు చేయాలని సీఈవో ను కోరారు. ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం వల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కంటోన్మెంట్ బోర్డు కు వచ్చే 303.62 కోట్ల రూపాయల నిధులకు ఎన్ఓసి మంజూరు చేయాలని కూడా  సీఈఓ ను కోరడం జరిగింది.

Search
Categories
Read More
Telangana
తెలంగాణ రాష్ట్ర రెడ్డి జేఏసీ కార్యవర్గ సమావేశం
సికింద్రాబాద్ :  సికింద్రాబాద్ లోని రాయల్ రేవ్ హోటల్ లో తెలంగాణ రాష్ట్ర రెడ్డి జేఏసీ...
By Sidhu Maroju 2025-10-15 10:34:33 0 63
International
అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం మళ్లీ మొదలు |
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చైనాపై మరోసారి వాణిజ్య బాంబు పేల్చారు. నవంబర్ 1,...
By Bhuvaneswari Shanaga 2025-10-11 04:51:33 0 66
Goa
गोआत 15 सप्टेंबरपासून पुन्हा जलक्रीडा सुरू, पर्यटनाक चालना
मोसमी रिपॉज (#MonsoonBreak) संपल्यानंतर गोआतल्या समुद्रकिनाऱ्यांवर #जलक्रीडा क्रिया 15...
By Pooja Patil 2025-09-11 10:53:35 0 64
Technology
గూగుల్ డూడుల్‌లో నోరూరించే ఇడ్లీ థీమ్ |
అక్టోబర్ 11న గూగుల్ తన హోమ్‌పేజ్‌లో ప్రత్యేక డూడుల్ ద్వారా దక్షిణ భారతీయ వంటకమైన...
By Bhuvaneswari Shanaga 2025-10-11 10:23:38 0 62
Telangana
కొకపేట దగ్గర జంటపై దొంగల దాడి |
నార్సింగి, కొకపేట సమీపంలో రాత్రి ఒక జంటపై ఆరు మందిగల మోటర్‌సైకిల్ గ్యాంగ్ దాడి చేసింది....
By Bhuvaneswari Shanaga 2025-09-23 10:59:19 0 242
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com