నేతన్నలకు భారీ గుడ్ న్యూస్ చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం

0
1K

*నేతన్నలకు సర్కార్ భారీ గుడ్ న్యూస్* తెలంగాణ ప్రభుత్వం నేతన్నలకు భారీ గుడ్ న్యూస్ తెలిపింది. చేనేత కార్మికులకు సంబంధించిన రూ.33 కోట్ల చేనేత రుణాలను మాఫీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు మరియు వాణిజ్య (టెక్స్టైల్) శాఖ 2025-26 బడ్జెట్‌లో భాగంగా చేనేత కార్మికులకు ఋణమాఫీ చేసేందుకు రూ.33 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలనా అనుమతి ఇచ్చింది. ఈ నిధులు"చేనేత కార్మికులకు రుణమాఫీ పథకం" కింద విడుదల చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు హ్యాండ్లూమ్స్ మరియు అప్పారెల్ ఎక్స్‌పోర్ట్ పార్క్స్ కమిషనర్‌కు ఆర్థికశాఖ ఆదేశాలు జారీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఋణమాఫీలు చేసినందుకు నేతన్నలు, చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తూ, ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Search
Categories
Read More
Telangana
ఆల్వాల్ డివిజన్ లోని హరిజనబస్తిలో సమస్యల పరిష్కారంపై ద్రుష్టి సారించిన, కార్పొరేటర్. ఎమ్మెల్యే,
  అల్వాల్ డివిజన్లోని హరిజన బస్తి లో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు స్థానిక కార్పొరేటర్...
By Sidhu Maroju 2025-07-12 16:50:14 0 1K
Business
పసిడి ధరలు పరాకాష్టకు: కొనుగోలుదారులకు షాక్ |
బంగారం ధరలు అక్టోబర్ 2025లో కొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి. 24 క్యారెట్ల పసిడి (10 గ్రాములు)...
By Bhuvaneswari Shanaga 2025-10-18 07:21:33 0 43
Telangana
అభివృద్ధి పనులు చేసేది కేంద్రం. మా ప్రభుత్వమే చేస్తుందని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.
 నడిచే సిసి రోడ్డు, పారే కాలువ, పెరిగే మొక్కలు, తినే బియ్యం మా ప్రభుత్వ పథకాలే అని,...
By Sidhu Maroju 2025-06-09 13:06:28 0 1K
Delhi - NCR
నేడు బ్యాంకులకు సెలవు.. ఆన్‌లైన్ సేవలు అందుబాటులో! |
అక్టోబర్ 25, 2025 న భారతదేశంలోని అన్ని బ్యాంకులు మూసివేయబడ్డాయి. ఇది నెలలో నాలుగవ శనివారం...
By Deepika Doku 2025-10-25 08:16:45 0 12
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com