Bharat Aawaz

పారిశ్రామిక సందర్శనలో మోడల్ స్కూల్ విద్యార్థులు

Chunarkar Jagadeesh
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
2 min read
0
Comments
4
Views

ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): ఆసిఫాబాద్ తెలంగాణ మోడల్ స్కూల్ & జూనియర్ కళాశాల విద్యార్థులు శుక్రవారం వృత్తి విద్యా కోర్సుల్లో భాగంగా బెల్లంపల్లిలో పారిశ్రామిక, క్షేత్రస్థాయి సందర్శన చేపట్టారు.

విద్యార్థులకు ప్రాక్టికల్ అవగాహన కల్పించేందుకు నిర్వహించిన ఈ పర్యటనలో భాగంగా, హెల్త్ కేర్ ట్రేడ్‌కు చెందిన విద్యార్థులు స్థానిక ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. అక్కడ అందుతున్న వైద్య సేవలు, ఆరోగ్య సంరక్షణ పద్ధతులపై అవగాహన పెంచుకున్నారు. అదేవిధంగా, మీడియా/ఐటీ విభాగాలకు చెందిన విద్యార్థులు బెల్లంపల్లిలోని 'Valuepitch' ఐటీ కంపెనీని సందర్శించి సాంకేతిక పరిజ్ఞానం, కంప్యూటర్ అప్లికేషన్లు, ఉపాధి అవకాశాలు మరియు వృత్తి నైపుణ్యాలపై ప్రత్యక్ష అవగాహన పొందారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ (హెచ్ఎం) దుర్గం మహేశ్వర్, ఒకేషనల్ బోధకులు సప్ప రాజేష్, హెల్త్ కేర్ వృత్తి విద్యా ట్రైనర్లు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా విద్యార్థులకు తమ సబ్జెక్టులపై మరింత పట్టు సాధించే అవకాశం లభించిందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.