Bharat Aawaz

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయానికి సమష్టిగా కృషి చేయాలి

Mahidhar Naidu
Verified User
BMA | BHARAT AAWAZ Member
3 min read
0
Comments
19
Views

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయానికి సమష్టిగా కృషి చేయాలి

 

పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన బీఆర్ఎస్ నాయకులు లకావత్ గిరిబాబు

 

ఏన్కూరు: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు లకావత్ గిరిబాబు పిలుపునిచ్చారు. గురువారం ఏన్కూరు మండల కేంద్రంలో నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

 

ఈ సందర్భంగా పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియపై పార్టీ శ్రేణులకు అవగాహన కల్పించారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించే బాధ్యతను నాయకులు, కార్యకర్తలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రచారాన్ని ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తూ ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని కోరారు. పార్టీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేసి ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

 

ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు గిద్దగిరి సత్యనారాయణ, మండల నాయకులు భూక్య ధర్మ నాయక్, మాజీ జెడ్పీటీసీ కిషన్ నాయక్, మాజీ సర్పంచ్ బోడా వినోద్, కడియాల సుధాకర్, కారుమంచి గోపి, భూక్య శంకర్, సాయి, రాచబంటి వీరభద్రం, బోడ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.