Bharat Aawaz

దీపావళి బాణసంచా విక్రయాలకు ముందస్తు అనుమతులు తప్పనిసరి.

Shyamala Yadagiri
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
2 min read
0
Comments
56
Views

దీపావళి పండుగ సందర్భంగా చింతూరు డివిజన్ పరిధిలో బాణసంచా విక్రయ దుకాణాలు ఏర్పాటు చేయాలనుకునే వ్యాపారులు సంబంధిత శాఖల నుంచి తప్పనిసరిగా ముందస్తు అనుమతులు, లైసెన్సులు పొందాలని చింతూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి శ్రీ చిట్టపులి నరేంద్ర పడాల్, ఐఏఎస్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలందరూ దీపావళి పండుగను ఆనందోత్సాహాలతో పాటు సురక్షితంగా జరుపుకునేలా బాణసంచా విక్రయదారులు, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బాణసంచా దుకాణాల నిర్వహణలో ప్రభుత్వం నిర్దేశించిన భద్రతా ప్రమాణాలు, అగ్నిమాపక నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు.

 

# Yadagiri