Bharat Aawaz

సింగరేణి డిస్మిస్ కార్మికులకు మరో అవకాశం రీ-ఎంప్లాయ్‌మెంట్‌పై సర్క్యులర్ జారీ చేసిన యాజమాన్యం

KalyanKumar Katakam
Verified User
BMA | BHARAT AAWAZ Member
3 min read
0
Comments
66
Views

సింగరేణి, నవంబర్ 3: సింగరేణి బొగ్గు గనుల్లో అనధికార గైర్హాజరు కారణంగా 2023 నుంచి 2025 మధ్య విధుల నుంచి తొలగించబడిన మాజీ కార్మికులకు తిరిగి ఉద్యోగంలో చేరేందుకు అవకాశం కల్పిస్తూ సింగరేణి యాజమాన్యం సర్క్యులర్ జారీ చేసింది. డిస్మిస్ కార్మికుల కేసులను పునఃపరిశీలించి, అర్హులకు పునర్నియామకం కల్పించే అంశాన్ని పరిశీలించేందుకు హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది.

ఇటీవల బొగ్గు బెల్ట్ ప్రాంతాల ప్రజాప్రతినిధులు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసి డిస్మిస్ కార్మికులకు మరో అవకాశం కల్పించాలని కోరారు. దీనిపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి సింగరేణి యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేయడంతో ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి.

2023 జనవరి 1 నుంచి 2025 డిసెంబర్ 31 మధ్య అనధికార గైర్హాజరు కారణంగా డిస్మిస్ అయిన, 2026 ఏప్రిల్ 1 నాటికి 46 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న కార్మికులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. గత ఐదు క్యాలెండర్ సంవత్సరాల్లో ఏవైనా రెండు సంవత్సరాల్లో కనీసం 100 మస్టర్ రోజులు పనిచేసి ఉండటంతో పాటు, జనరల్ అసిస్టెంట్ ట్రైనీ (అండర్‌గ్రౌండ్) కేటగిరీ-1 పోస్టుకు వైద్యపరంగా అర్హత కలిగి ఉండాలి.

అర్హులైన మాజీ కార్మికులు నిర్దేశిత నమూనాలో దరఖాస్తులను గతంలో పనిచేసిన గని లేదా విభాగం అధిపతికి సమర్పించాలి. దరఖాస్తుల స్వీకరణకు నవంబర్ 14, 2026 చివరి తేదీగా యాజమాన్యం నిర్ణయించింది.

సింగరేణి యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగాలు కోల్పోయిన మాజీ కార్మికులు, వారి కుటుంబాల్లో తిరిగి ఉద్యోగం పొందవచ్చనే ఆశలు చిగురిస్తున్నాయి.