0
Comments
119
Views
అనకాపల్లి జిల్లా రోలుగుంటలో ZPTC అభ్యర్థి సుర్ల సత్యం నాయుడు, MPTC అభ్యర్థి సుర్ల నాగరత్నం గడపగడప ప్రచారం చేశారు. మీ బిడ్డగా, మీలో ఒకడిగా వస్తున్నా ఆశీర్వదించండని, దివంగత నేత సుర్ల సత్యం నాయుడు మనవడిగా సేవ చేస్తానని సత్యం నాయుడు కోరారు. తమ కుటుంబం ప్రజా సేవకే అంకితమని నాగరత్నం అన్నారు. మాజీ MPTC రామకృష్ణ, నర్సింగరావు, సుర్ల రమణ, బొడ్డు శ్రీరామ్మూర్తి, శ్రీను, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.