Bharat Aawaz

పలాస 12వ వార్డులో యుగంధర్ ప్రచార జోరు.. ప్రమాదం ఎదురైనా వెనకడుగు లేదు!

Konchada Ravi
Verified User
BMA | BHARAT AAWAZ Member
2 min read
0
Comments
310
Views

పలాస–కాశీబుగ్గ: మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 12వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మార్పు యుగంధర్ దూసుకుపోతున్నారు. నామినేషన్ దాఖలు చేసిన వెంటనే ప్రమాదానికి గురైనప్పటికీ, మనోధైర్యంతో తిరిగి ప్రచార బరిలోకి దిగారు. సోదరులు, బంధువులు, మిత్రుల సహకారంతో వార్డులో ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలుస్తున్నారు.

గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైనప్పటికీ, గత ఐదేళ్లుగా వార్డు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశానని యుగంధర్ తెలిపారు.

తన సేవలను గుర్తించి, తనపై నమ్మకంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా అవకాశం కల్పించిన మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజుకు ఈ ఎన్నికల్లో విజయం సాధించి కానుకగా అందిస్తానని ధీమా వ్యక్తం చేశారు.

ప్రమాదం ఎదురైనా ప్రచారంలో వెనుకడుగు వేయకుండా ముందుకు సాగుతున్న యుగంధర్‌కు కుటుంబ సభ్యులు, సన్నిహితులు అండగా నిలుస్తున్నారు. 12వ వార్డులో ఆయన ప్రచారం ఓటర్లను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.