0
Comments
106
Views
సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికై ప్రత్యేకత చాటుకున్నారు. టీడీపీకి చెందిన తుపాకుల కన్నమ్మ నాయుడుపేట జడ్పీటీసీగా, ఆమె భర్త తుపాకుల చిరంజీవి భీమవరం ఎంపీటీసీగా, తోడికోడలు తుపాకుల శశిరేఖ ఓజిలి జడ్పీటీసీ సభ్యురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మూడు వేర్వేరు స్థానాల్లో ఒకే కుటుంబ సభ్యులు ఏకగ్రీవం కావడం స్థానికంగా చర్చనీయాంశమైంది.