Bharat Aawaz

*వినతి పత్రం*

Chakrala Sadhanand
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
3 min read
0
Comments
230
Views

*శ్రీయుత గౌరవనీయులైన*

గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, తదితరులు మరియు VDC సభ్యులకు,

*కులాస్ పూర్ గ్రామం,*

*మొగ్పాల్ మండల్,*

*నిజామాబాద్ జిల్లా,*

*తెలంగాణ.*

 

*విషయం :- గ్రామ ప్రధాన రహదారిపై తెల్ల గీతలు (White lines) మరియు రిఫ్లెక్టర్ స్టడ్స్ (Reflective studs) ఏర్పాటు చేయమని కోరుతూ.*

ఆర్యా,

మన కులాస్ పూర్ గ్రామంలో ప్రస్తుతం వరి కోతలు జరుగుతున్నవి. రైతులందరూ ప్రధాన రహదారిపై ధాన్యాన్ని ఆరబెడుతున్నారు.

*దీని వలన:*

1. రాత్రి వేళల్లో వాహనదారులకు రోడ్డుపై ఉన్న ధాన్యం కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

2. ద్విచక్ర వాహనాలు జారిపడుతున్నాయి.

3. పాఠశాల పిల్లలకు, వృద్ధులకు నడవడానికి ఇబ్బందిగా ఉంది.

కావున, ప్రమాదాల నివారణ కోసం మా గ్రామ ప్రధాన రహదారిపై ఈ క్రింది చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.

*మా విజ్ఞప్తి :-*

1. రోడ్డు మధ్యలో మరియు పక్కల తెల్ల గీతలు (Centre and side white lines) వేయించడం.

2. ధాన్యం ఆరబెట్టే ప్రదేశాల వద్ద రిఫ్లెక్టర్ టేప్ లు మరియు రిఫ్లెక్టివ్ స్టడ్స్ వేయించడం.

3. "ముందు ధాన్యం ఆరబెడుతున్నారు - నెమ్మదిగా వెళ్ళండి" అనే బోర్డులు ఏర్పాటు చేయడం.

4. వీలైతే పంచాయతీ తరపున ధాన్యం ఆరబెట్టుకోవడం కోసం ఒక శాశ్వత స్థలం కేటాయించడం.

5. రైతులతో మీటింగ్ పెట్టి రోడ్డుకి ఒక వైపు మాత్రమే ఆరబెట్టుకోవాలని, పూర్తి రోడ్డు Block చేయొద్దని చెప్పడం.

6. ధాన్యం చుట్టూ రాళ్లు, ఇటుకలు మరియు కర్రల వంటివి పెట్టకూడదని, దాని వల్ల ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయని రైతులకు వివరించడం.

7. మీరు తీసుకునే చర్యల వలన రైతులు, వారి ధాన్యం మరియు ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకుండా చూడగలరు.

ఇది రైతులకు, వాహనదారులకు ఎంతో సురక్షితంగా ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని గ్రామ సభలో లేవనెత్తి మండల పంచాయతీ రాజ్ / R&B శాఖ వారికి పంపగలరని ప్రార్థన.🙏🙏🙏

*రైతుల సంతకం*

B. Arun

Abdul Hameed

D. శ్రీకాంత్

K. సతీష్

B. Javeed

 

*ఇట్లు,*

గ్రామ రైతులు మరియు యువత తరపున,

కులాస్ పూర్ గ్రామం, మొగ్పాల్ మండల్.

 

పేరు :- భూన రాజశేఖర్

ఫోన్ నెంబర్ :- 7893263809