Bharat Aawaz

ముగిసిన వూషూ రాష్ట్ర స్థాయి సీనియర్ పోటీలు

Avunoori Mahesh
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
2 min read
0
Comments
26
Views

మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో ఈ నెల 24, 25 తేదీల్లో నిర్వహించిన నాలుగో అంతర్రాష్ట్ర వుషు సీనియర్ పురుషులు, మహిళల పోటీలు ముగిశాయి. రెండు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో రాష్ట్రంలోని సుమారు 33 జిల్లాల నుంచి 150 మంది క్రీడాకారులు పాల్గొని తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించారు.పోటీల ప్రారంభోత్సవానికి జిల్లా యువజన, క్రీడల అధికారి హనుమంత్ రెడ్డి, శ్రీరాంపూర్ ఎస్సై సంతోష్, రాష్ట్ర వుషు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ ఉమర్, జాయింట్ సెక్రటరీ వేముల సతీష్, జిల్లా వుషు అధ్యక్షుడు రాజనర్స్, జిల్లా రగ్బీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు లింగంపల్లి శేఖర్, కార్యదర్శి ఆవునూరి మహేష్ హాజరయ్యారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, ఇలాంటి పోటీలు క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు, వుషు క్రీడ అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు. క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.