లోగాని సాయిబాబు మృతి పట్ల మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు దంపతులు, ముత్యాల ప్రవీణ్ కుమార్–శ్రీలత దంపతుల సంతాపం
Mahidhar Naidu
BMA | BHARAT AAWAZ Member
2 min read
0
Comments
51
Views
లోగాని సాయిబాబు మృతి పట్ల మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు దంపతులు, ముత్యాల ప్రవీణ్ కుమార్–శ్రీలత దంపతుల సంతాపం
పాత పాల్వంచకు చెందిన లోగాని లక్ష్మీ నరసయ్య వారి కుమారుడు, ఎన్ఎండిసి విశ్రాంత ఉద్యోగి లోగాని సాయిబాబు అకాల మరణం పట్ల మాజీ మంత్రి శ్రీ వనమా వెంకటేశ్వరరావు దంపతులు, 46వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల ప్రవీణ్ కుమార్–శ్రీలత దంపతులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సాయిబాబు మృతి తమను ఎంతగానో కలచివేసిందని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకున్నారు.