Bharat Aawaz

*తిరుమలగిరి - ఆల్వాల్ రోడ్డులో మృత్యు వేగం - తప్పిన పెను ప్రమాదం*

VALLERU SIMHADRI
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
2 min read
0
Comments
50
Views

*హైదరాబాద్, తిరుమలగిరి:* తిరుమలగిరి నుంచి ఆల్వాల్ వెళ్లే రద్దీ రోడ్డులో ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ కలకలం రేపింది.

ఈ రోజు, తేదీ *24-10-2026* న, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సమీపంలో *TS07KG9748* నంబర్ గల నల్ల టాటా నెక్సాన్ కారు, చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అత్యంత రాష్ గా, ప్రమాదకరంగా వెళ్తూ కనిపించింది.

రోడ్డు పక్కన టైర్ల షాపులు, ప్రజలు, బైక్ పై వెళ్తున్న వారు ఉన్నా కూడా పట్టించుకోకుండా అతివేగంగా దూసుకెళ్లింది. కొంచెం అయితే చాలు పెద్ద ప్రమాదం జరిగేది, అదృష్టవశాత్తు తప్పింది. దీనికి సంబంధించిన ఫోటోను స్థానికులు తీశారు.

"హైదరాబాద్ లో ట్రాఫిక్ పోలీసులు ఇలాంటి వాటిని పట్టించుకోరా? తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తోంది? ఇలాంటి రాష్ డ్రైవింగ్ వల్ల అమాయకుల ప్రాణాలు పోతే ఎవరు బాధ్యత వహిస్తారు?" అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

కాబట్టి, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఈ కారు నంబర్ *TS07KG9748* పై చర్యలు తీసుకొని, సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి, కఠిన జరిమానా విధించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.