Bharat Aawaz

భగవాన్ నాయక్ తండ సమీపంలో కారు బోల్తా పూర్తి

Mahidhar Naidu
BMA | BHARAT AAWAZ Member
2 min read
0
Comments
48
Views

భగవాన్ నాయక్ తండ సమీపంలో కారు బోల్తా 

ఏన్కూరు మండలం భగవాన్ నాయక్ తండ సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని తప్పించుకుంటే కారు అదుపుతప్పి పల్టీ కొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు గాయపడ్డారు. వీరిలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.

 వివరాల్లోకి వెళితే.. ఎర్రుపాలెం మండలానికి చెందిన ఐలూరి రాజశేఖర్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో పాల్వంచకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. మార్గమధ్యలో భగవాన్ నాయక్ తండ సమీపంలో ఎదురుగా వచ్చిన లారీని తప్పించడంతో కారు అదుపుతప్పి రోడ్డుపై పల్టీ కొట్టినట్లు తెలిసింది.

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఏన్కూరు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆసుపత్రికి పంపించారు.