Bharat Aawaz

బూరుగుపాలెం విద్యార్థిని మల్లకంభ జాతీయస్థాయికి ఎంపిక

Chevvakula Bhaskararao
Verified User
BMA | BHARAT AAWAZ Member
1 min read
0
Comments
116
Views

 అనకాపల్లి జిల్లా బూరుగుపాలెం జెడ్పీహెచ్ఎస్ 9వ తరగతి విద్యార్థిని ఎం షర్మిల తండ్రి మర్రి నాయుడు తల్లి రమ కుమార్తె మల్లకంభలో సత్తా చాటింది. పశ్చిమగోదావరి వీరవాసరంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో 14 ఏళ్ల బాలికల విభాగంలో వెండి పతకం సాధించి జాతీయస్థాయికి ఎంపికైంది. నవంబర్ 24 నుంచి 27 వరకు ఉజ్జయినిలో జరిగే జాతీయ పోటీల్లో పాల్గొననుంది. ప్రధానోపాధ్యాయురాలు మహాలక్ష్మి పీడీ సీహెచ్ రాజబాబు బోధన బోధనేతర సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.