Bharat Aawaz

జిల్లా ఎస్పీ రోహిత్ రాజును కలిసిన ఎస్హెచ్ఓ సాయి కిషోర్ రెడ్డి.

Thupakula Mahesh
Verified User
BMA | BHARAT AAWAZ Member
2 min read
0
Comments
112
Views

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ని అశ్వారావుపేట నూతన ఎస్హెచ్ఓ సాయి కిషోర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

అశ్వారావుపేట ఎస్హెచ్ఓగా పోస్టింగ్ వచ్చినందుకుగాను ప్రోటోకాల్ ప్రకారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, నేరాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించి, పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.అశ్వారావుపేట మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని, ప్రజా సమస్యల పరిష్కారానికి పాటుపడతానని ఎస్హెచ్ఓ సాయి కిషోర్ రెడ్డి తెలిపారు.