Bharat Aawaz

బతుకమ్మ తల్లి విగ్రహాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి.,

Gujile Ramu
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
2 min read
0
Comments
96
Views

వరంగల్ జిల్లా  దుగ్గొండి  మండలం చాపలబండ గ్రామంలో ఆడపడుచుల ఆరాధ్య దైవమైన బతుకమ్మ తల్లి విగ్రహాన్ని నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ.. బతుకమ్మ తల్లి విగ్రహం మన రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకుంటూ, భావితరాలకు వాటి గొప్పతనాన్ని తెలియజేయాల్సిన బాధ్యత తెలంగాణ ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ఐక్యతకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని, తరతరాలుగా వస్తున్న ఈ గొప్ప సాంస్క ృతిక వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచి అల్లాడి ప్రభు, దొంతి అవి యుక్తు రెడ్డి,సొసైటీ చైర్మన్ తోకల శ్రీనివాస్ రెడ్డి, క్లస్టర్ ఇంచార్జి ఏడెల్లి శ్రీనివాస్ రెడ్డి ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.... దుగ్గొండి మండలం రిపోర్ట్ జి రాము...