Bharat Aawaz

Madanapalle: అన్నమయ్య జిల్లా పుంగనూరు మున్సిపల్ ఎన్నికల ఘర్షణ కేసులో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని ఏ1గా పోలీసులు పేర్కొన్నారు.

Pagadala Venkateswar
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
2 min read
0
Comments
86
Views

Madanapalle: అన్నమయ్య జిల్లా పుంగనూరులో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిని A1గా, సుధీర్ రెడ్డిని A2గా, మాజీ ఎంపీ రెడ్డప్పను A3గా, మదనపల్లె నియోజకవర్గ వైసీపీ యువ నాయకుడు హర్షవర్ధన్ రెడ్డిని A4గా పేర్కొన్నారు. యశ్వంత్‌ను A5గా, నాగభూషణాన్ని A6గా పేర్కొంటూ మొత్తం 62 మందిని కేసులో నిందితులుగా చేర్చినట్లు సమాచారం. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి నామినేషన్ సందర్భంగా జరిగిన ఘర్షణ నేపథ్యంలో ఈ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.