Bharat Aawaz

తెలంగాణ అంటేనే బతుకమ్మ.. బతుకమ్మ అంటేనే తెలంగాణ

SRAVAN KUMAR
Verified User
Reporter, Sr. Journalist Or Constituency In-Charge - Bharat Aawaz | BMA Member
3 min read
0
Comments
83
Views

రామగుండం సీఐ కృష్ణకుమార్న్టీపీసీ కృష్ణానగర్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. విజేతలకు బహుమతుల ప్రదానం.రామగుండం: రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎన్టీపీసీ కృష్ణానగర్‌లో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం సీఐ కృష్ణకుమార్, విశిష్ట అతిథిగా ఎన్టీపీసీ ఎస్‌ఐ వెంకటస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయబద్ధంగా రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలను అతిథులు పరిశీలించారు. అనంతరం అందంగా పేర్చిన బతుకమ్మల్లో మొదటి, రెండవ, మూడవ బహుమతులకు ఎంపికైన విజేతలకు సీఐ కృష్ణకుమార్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా సీఐ కృష్ణకుమార్ మాట్లాడుతూ.. బతుకమ్మ వేడుకలను చూస్తుంటే తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయని అన్నారు. గతంలో తమ సోదరీమణులు బతుకమ్మలు పేర్చేందుకు అడవులకు వెళ్లి తంగేడు, గునుగు తదితర రకాల పూలను సేకరించి తీసుకొచ్చే రోజులు గుర్తుకు వస్తున్నాయని భావోద్వేగంగా పేర్కొన్నారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటిచెప్పే గొప్ప పండుగ అని అన్నారు. తెలంగాణ అంటేనే బతుకమ్మ.. బతుకమ్మ అంటేనే తెలంగాణ అని పేర్కొంటూ ప్రతి ఒక్కరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.పండుగ వేడుకల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొనడంతో పాటు ఆటపాటల సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని పోలీస్ అధికారిగా సూచించారు. అనంతరం కార్యక్రమ నిర్వాహకులు సీఐ కృష్ణకుమార్, ఎస్‌ఐ వెంకటస్వామిలను ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో డీసీసీ అధికార ప్రతినిధి, కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేష్, కమిటీ సభ్యులు కంకణాల ముకుందరెడ్డి, కొలిపాక మల్లయ్య, అశోక్ కుమార్, శ్రీనివాస్, గణేష్, సదానందం, చల్ల శ్రీనివాస్, కాలనీవాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.