Bharat Aawaz

ఆసిఫాబాద్ జిల్లాలో ఆయుష్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ కలెక్టర్ హరిత

Chunarkar Jagadeesh
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
2 min read
0
Comments
133
Views

ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్: కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని నిరుద్యోగులకు ప్రభుత్వం ఉపాధి పొందే చక్కని అవకాశాన్ని కల్పించింది. జాతీయ ఆయుష్ మిషన్ (National Ayush Mission) కింద అవుట్‌సోర్సింగ్ విధానంలో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న 10 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్  కె హరిత  గారు ఒక ప్రకటనలో తెలిపారు.

భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు:

• మెడికల్ ఆఫీసర్లు

• డైటీషియన్

• కౌన్సిలర్

• యోగా ప్రొఫెషనల్

• మల్టీపర్పస్ వర్కర్స్ 

ముఖ్యమైన తేదీలు:

ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుండి ఈ నెల 22 నుండి 27 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు.

అర్హత, వయోపరిమితి మరియు దరఖాస్తు విధానం వంటి పూర్తి వివరాల కోసం అభ్యర్థులు జిల్లా అధికారిక వెబ్‌సైట్ asifabad.telangana.gov.in ను సందర్శించాలని ఆమె సూచించారు.