Bharat Aawaz

ఏపీ కి మిర్యాలగూడ కు చెందిన విద్యుత్ ఉద్యోగులు

Riaz Ahamed Siddiqi
Verified User
BMA | BHARAT AAWAZ Member
3 min read
0
Comments
139
Views

*ఏపీకి మిర్యాలగూడ డివిజన్ విద్యుత్ సహాయక బృందాలు*

 

మిర్యాలగూడ: ఆంధ్రప్రదేశ్ లో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణకు తెలంగాణ విద్యుత్ సంస్థ సహాయక బృందాలను పంపింది.

 

*టీజీఎస్పీడీసీఎల్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ జితేష్ పాటిల్, ఐఏఎస్ గారి ఆదేశాల మేరకు,* నల్గొండ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మిర్యాలగూడ డివిజన్ నుండి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

 

తుఫాన్ కారణంగా ఏపీలోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో విద్యుత్ స్తంభాలు, లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు నేలకూలాయి. పునరుద్ధరణ పనులను వేగవంతం చేయడానికి ప్రత్యేక వాహనాలు, అత్యాధునిక బ్యాటరీ ట్రీ ప్రూనర్లు, అత్యవసర పరికరాలతో మిర్యాలగూడ డివిజన్ విద్యుత్ ఉద్యోగులు, సిబ్బంది ఈరోజు తెల్లవారుజామున బయలుదేరారు. ఉన్నతాధికారులు జెండా ఊపి బృందాల వాహనాలను ప్రారంభించారు.

 

ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ డివిజనల్ ఇంజనీర్ శ్రీనివాస్ ఆచారి, డివిజన్ ఏడీఈలు తిరుపతయ్య, కోడిరెక్క రవికుమార్, ఇందిరా, ఏఈలు వినోద్ కుమార్, రవీందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, జానయ్య, కృష్ణారెడ్డి, సీనియర్ లైన్ ఇన్‌స్పెక్టర్లు మారం శ్రీనివాస్, వీరభద్రం, ఎల్లయ్య చారి, బిక్షం, జలంధర్, భాస్కర్, సతీష్, వెంకటరత్నం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

భారత్ ఆవాజ్

 

మిర్యాలగూడ 

రియాజ్