Bharat Aawaz

ఆసిఫాబాద్ మోడల్ పాఠశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ డీఈవో సచ్చిదానంద చారి

Chunarkar Jagadeesh
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
2 min read
0
Comments
104
Views

🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్)

ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల (మోడల్ స్కూల్)లో ఐఐటీ (IIT), నీట్ (NEET), జేఈఈ (JEE) కోచింగ్ అందించడానికి 6 గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) సచ్చిదానంద చారి ఒక ప్రకటనలో తెలిపారు.

ఎంఎస్సీ (MSc) మ్యాథ్స్, జువాలజీ, బోటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాలలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన అర్హులైన అభ్యర్థులు నవంబర్ 6వ తేదీ లోగా asifabad.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఆన్‌లైన్ దరఖాస్తుకు సంబంధించిన హార్డ్ కాపీలను (పత్రాలను) ఆసిఫాబాద్‌లోని డీఈవో కార్యాలయంలో అందజేయాలని కోరారు.