Bharat Aawaz

కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లో 5 నుంచి 6 పులుల సంచారం – డీఎఫ్‌ఓ బాలమణి

Chunarkar Jagadeesh
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
2 min read
0
Comments
111
Views

🎤ఆసిఫాబాద్  (భారత్ ఆవాజ్ న్యూస్)

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో ఎల్లప్పుడూ 5 నుంచి 6 పులులు నిరంతరం సంచరిస్తున్నాయని జిల్లా అటవీ శాఖ అధికారి (DFO) బాలమణి వెల్లడించారు. జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ వన్యప్రాణుల రక్షణ, పులుల కదలికలపై కీలక వివరాలను పంచుకున్నారు.

మహారాష్ట్రలోని తడోబా అడవులకు, ఇటు కవ్వాల్ అడవులకు మధ్య విస్తరించి ఉన్న సహజసిద్ధమైన అటవీ అనుసంధానం (Forest Corridor) వల్ల పులులు సరిహద్దు ప్రాంతాల గుండా అటు ఇటు స్వేచ్ఛగా తిరుగుతుంటాయని ఆమె వివరించారు.

ఇది పూర్తిగా ఒక సాధారణ ప్రక్రియ మాత్రమేనని, ఈ అడవులన్నీ వన్యప్రాణులకు ఉమ్మడి సంచార ప్రాంతాలుగా ఉండటంతో పులుల రాకపోకలు సహజంగానే జరుగుతుంటాయని బాలమణి స్పష్టం చేశారు. జిల్లాలో వన్యప్రాణుల రక్షణకు, అటవీ సంరక్షణకు శాఖా పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.