Bharat Aawaz

బాధితులకు అండగా కూటమి ప్రభుత్వం – 32 మంది లబ్ధిదారులకు ₹19.25 లక్షల సీఎం సహాయ నిధి (CMRF) చెక్కులను అందజేసిన ప్రభుత్వ విప్ గణబాబు

Santhosh Kumar
Verified User
BMA | BHARAT AAWAZ Member
4 min read
0
Comments
138
Views

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం ఆపదలో ఉన్న పేదలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ప్రభుత్వ విప్, విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) పేర్కొన్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేటు ఆసుపత్రుల్లో ఖరీదైన వైద్య చికిత్సలు పొందిన నియోజకవర్గ పరిధిలోని నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన చెక్కులను ఆయన తన కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు.

ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ వార్డులకు చెందిన 32 మంది లబ్ధిదారులకు మొత్తం ₹19,25,054 (పంతొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల యాభై నాలుగు రూపాయల) విలువైన సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే గణబాబు గారు స్వయంగా పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ, పేద కుటుంబాలు తీవ్ర అనారోగ్యం పాలైనప్పుడు వైద్య ఖర్చుల భారం తగ్గించి వారికి నాణ్యమైన చికిత్స అందేలా సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో దోహదపడుతోందన్నారు. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పరంగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు చేరేలా నిరంతరం కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కష్టకాలంలో ప్రభుత్వం తమకు ఆర్థిక సహాయం అందించి ఆదుకోవడం పట్ల లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యే గణబాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

లబ్ధిదారుల వివరాలు:

వార్డు 52:

• కొరడ రత్నం – ₹50,896

​వార్డు 56:

• పిల్ల గోవింద గణేశ్వరరావు – ₹30,000

• నమ్మి ఉషాలత – ₹65,314

• కళ్ళ కనకలక్ష్మి – ₹46,812

​వార్డు 57:

• మక్కా కొండమ్మ – ₹41,585

• సిగిరెడ్డి చిలకమ్మ – ₹25,000

​వార్డు 58:

• బొండడ వెంకట రత్నం – ₹1,27,687

• సూరమపిల్లి నూకరత్నం – ₹77,258

​వార్డు 59:

• లంక వెంకటరమణ – ₹42,147

• ఎదురు శివశంకర్ – ₹30,934

• బొట్టా రోజా – ₹30,786

• ప్రగడ సుజాత – ₹1,70,000

• బొగుల మురళీకృష్ణ – ₹1,00,000

• పిలకా అప్పారావు – ₹1,00,000

• కుంచా వెంకటరమణ – ₹1,00,000

​వార్డు 60:

• కందిమండి లలిత – ₹65,026

• నాట్ర ఆనంద్ – ₹25,166

• మాతా సూర్యారావు – ₹70,027

​వార్డు 61:

• నడుపూరి లక్ష్మి – ₹51,784

​వార్డు 62:

• దేవరపల్లి ఈశ్వరరావు – ₹34,100

​వార్డు 63:

• సమ్మింగ వెంకటరావు – ₹1,22,403

​వార్డు 89:

• పడమటి సత్యం – ₹22,000

• సంపాంగి శ్రీనివాసరావు – ₹56,329

• పొట్నూరు కిశాంత్ – ₹32,101

• బొడ్డేటి రాము – ₹1,24,387

• కైదకళ్ళ అనూరాధ – ₹30,786

• కె. సాయి లక్ష్మి – ₹41,112

​వార్డు 91:

• వజ్జిపర్తి లక్ష్మి – ₹20,000

​వార్డు 92:

• పెడపూడి అప్పలరాజు – ₹17,795

• సత్తి అప్పారావు – ₹20,524

• దాడి సన్యాసిరావు – ₹1,00,000

• ఆకుల అప్పల సూరి దేవుడు – ₹53,095

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.