Bharat Aawaz

తెలుగు సాహితీ లోకంలో విషాదం.. ముదిగొండ ఇకలేరు

Pagadala Venkateswar
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
2 min read
0
Comments
94
Views

చారిత్రక నవలా చక్రవర్తి ముదిగొండ శివప్రసాద్ కన్నుమూత

హైదరాబాద్‌లో గుండెపోటుతో 86 ఏళ్ల వయసులో అస్తమయం

ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసిన ముదిగొండ

80కి పైగా చారిత్రక, సాహిత్య గ్రంథాలు రచించిన ఘనత

 

ప్రముఖ చారిత్రక నవలా రచయిత, 'చారిత్రక నవలా చక్రవర్తి'గా ఖ్యాతి గడించిన ముదిగొండ శివప్రసాద్ (86) కన్నుమూశారు. గత ఆరు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు గురువారం రాత్రి గుండెపోటు రావడంతో హైదరాబాద్‌లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 8:45 గంటల సమయంలో మరోసారి గుండెపోటు రావడంతో ఆయన తుదిశ్వాస విడిచారు.

 

1940 డిసెంబర్ 23న ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామంలో జన్మించిన శివప్రసాద్, హైదరాబాద్‌లోనే స్థిరపడ్డారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు విభాగంలో ఆచార్యులుగా పనిచేసి పదవీ విరమణ చేశారు. తన సుదీర్ఘ సాహిత్య ప్రస్థానంలో ఆయన 80కి పైగా గ్రంథాలను రచించగా, వాటిలో 20కి పైగా చారిత్రక నవలలు ఉన్నాయి. కాకతీయ కళాదర్శనం, తంజావూరు విజయం, రెసిడెన్సీ, శ్రీలేఖ, ఆవాహన వంటి రచనలు తెలుగు సాహిత్యంలో విశేష ఆదరణ పొందాయి. భారత చరిత్రను, సంస్కృతిని తన రచనల ద్వారా సామాన్య పాఠకులకు చేరువ చేయడంలో ఆయన విశేష కృషి చేశారు.