Bharat Aawaz

ఎల్‌నినో ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లోని రైతాంగం ఎదుర్కొంటున్న కష్టాలు, వారి కన్నీటి గాథలు నేడు హృదయ విదారకంగా మారాయి

Dudekula Valibasha
Verified User
BMA | BHARAT AAWAZ Member
2 min read
0
Comments
266
Views

చిన్నహోతూరు గ్రామం, ఆస్పరి మండలం, కర్నూలు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ స్థానం కంది రైతు ఎంతో కష్టపడి భూమిని దున్ని, విత్తనాలు వేసి, ఎరువులు మరియు మందులు ఉపయోగించి పంటను సాగు చేస్తాడు. పంట చేతికి వచ్చే సమయంలో ఎల్‌నినో వల్ల పంట యెండిపోయి దెబ్బతింటే రైతుకు తీవ్ర ఆర్థిక నష్టం కలుగుతుంది.

పంటపై ఎల్లోనివల్ల ఆకులు, కొమ్మలు మరియు పంట దిగుబడి దెబ్బతిని నాణ్యత తగ్గుతుంది. దీనివల్ల మార్కెట్‌లో సరైన ధర లభించకపోవచ్చు. ఇప్పటికే విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చులు, నీటి ఖర్చులు వంటి వాటిపై పెట్టుబడి పెట్టిన రైతుకు మరింత నష్టం వస్తుంది.

ఒకవైపు పంట నష్టం, మరోవైపు అప్పుల భారం రైతు కుటుంబంపై ఆర్థిక ఒత్తిడిని పెంచుతుంది. అందువల్ల పంట నష్టాన్ని అధికారులు పరిశీలించి, నష్టాన్ని నమోదు చేసి, అర్హత ఉన్న రైతులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిహారం లేదా పంట బీమా ప్రయోజనం అందేలా చర్యలు తీసుకోవాలి.

“రైతు నష్టపోతే కేవలం ఒక కుటుంబం మాత్రమే కాదు, మన ఆహార వ్యవస్థ మొత్తం ప్రభావితమవుతుంది.”

రైతుల పంటలను రక్షించేందుకు వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, తగిన సూచనలు మరియు అవసరమైన సహాయం అందించాలి