రైల్వే గేట్లకు ఇక గుడ్‌బై.|

0
47

▪ గౌతమ్‌నగర్ RUB, బొల్లారం ROB పనులకు కదలిక

▪ రైల్వే చీఫ్ ఇంజనీర్‌తో ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డి భేటీ

▪ పనులు వేగంగా చేపట్టాలని విజ్ఞప్తి

మల్కాజ్‌గిరి, సెప్టెంబర్ 19: రైల్వే గేట్ల వద్ద నిత్యం ఎదురవుతున్న ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ పెట్టే దిశగా మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో కీలక ముందడుగు పడింది.

గౌతమ్‌నగర్ RUB, బొల్లారం ROB పనులను త్వరితగతిన చేపట్టాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి రైల్వే అధికారులను కోరారు.

శనివారం హైదరాబాద్ డివిజనల్ రైల్వే చీఫ్ ఇంజనీర్ సదరం రాయల్‌ను ఆయన కార్యాలయంలో కలిసిన ఎమ్మెల్యే.. గౌతమ్‌నగర్ RUB, బొల్లారం ROB పనుల పురోగతిపై చర్చించారు. 

ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా పనులను త్వరగా ప్రారంభించి పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఎమ్మెల్యే విజ్ఞప్తిపై సదరం రాయల్ సానుకూలంగా స్పందించి, RUB, ROB పనులకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

మల్కాజ్‌గిరి నియోజకవర్గాన్ని రైల్వే గేట్ల సమస్య నుంచి విముక్తి చేసి, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు రైల్వే అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

కార్యక్రమంలో SSE రవి ప్రకాష్, ఇతర రైల్వే అధికారులు, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, సతీష్, శ్రీనివాస్, బీఆర్‌ఎస్ నాయకులు బద్ధం పరశురాం రెడ్డి, తులసి సురేష్, ఫరీద్, విజయ్ రెడ్డి, చిన్న యాదవ్, ఉపేందర్, శ్రీకాంత్, లక్ష్మణరావు, శ్రీధర్, సురేష్, విజయ్, లక్ష్మణ్, ఎం.ఆర్. శ్రీనివాస్, బాలకృష్ణ, సాయి తదితరులు, స్థానిక కాలనీల వాసులు పాల్గొన్నారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
తాగునీటి నిర్మాణాలు పూర్తి.. వినియోగం శూన్యం: గొట్టిగుండ్ల గ్రామస్తుల ఆవేదన
కొండపురం (నెల్లూరు జిల్లా): మండల పరిధిలోని గొట్టిగుండ్ల గ్రామంలో 2024 జులై 31 నాటికి తాగునీటి...
By VALLERU SIMHADRI 2026-09-15 13:05:55 0 109
Dadra &Nager Haveli, Daman &Diu
Admissions & Scholarship Alerts for Academic Year 2026-27
The administration has officially announced the commencement of the hostel admission process for...
By Lokeshwari Panthadi 2026-07-01 05:09:34 0 274
Andhra Pradesh
అన్నదాతకు అండగ చంద్రన్న ఐటీడీపీ నియోజకవర్గ నాయకులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం...
By Benguluri Madhubabu 2026-03-20 05:37:39 0 233
Andhra Pradesh
ఈరోజు పద్మశ్రీ భానుమతి గారి వర్ధంతి
ఈరోజు పద్మశ్రీ భానుమతి గారి   వర్ధంతి 🌹   *బహుముఖ ప్రజ్ఞాశాలి.‌‌.."భానుమతీ...
By Rajini Kumari 2025-12-24 10:41:30 0 224
Madhya Pradesh
Rainfall Deficit: Monsoon Delay Strains Agriculture Sector
The delayed onset of the southwest monsoon, coupled with significantly low rainfall throughout...
By Lokeshwari Panthadi 2026-07-01 07:11:07 0 92
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com