కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో విస్తృత పోలీస్ అవగాహన కార్యక్రమం ఎస్పీ నితికా పంత్ ఆదేశాల మేరకు జముల్దారాలో కళాబృందం ప్రదర్శనలు

0
75

🎤భారత్ ఆవాజ్ న్యూస్ (కుమ్రం భీం  ఆసిఫాబాద్): కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి నితికా పంత్, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో లింగాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జముల్దారా గ్రామంలో ప్రజలకు విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కళాబృందం సభ్యులు తమ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా సమాజంలో జరుగుతున్న పలు ప్రధానాంశాలపై గ్రామీణులకు చైతన్యం కల్పించారు. ముఖ్యంగా గంజాయి సాగు మరియు వినియోగం వల్ల కలిగే నష్టాలు, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, బాల్య వివాహాల నివారణ, ట్రాఫిక్ నిబంధనలు & రోడ్డు భద్రత, నూతన చట్టాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించారు. వీటితో పాటు గ్రామాల్లో భద్రత కోసం సీసీ కెమెరాల ఆవశ్యకతను వివరిస్తూనే, మూఢనమ్మకాలు మరియు సామాజిక మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని, అలాగే ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా 112 నెంబర్‌కు కాల్ చేసి పోలీసుల సహాయం పొందాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో లింగాపూర్ ఎస్ఐ సురేష్, పోలీస్ సిబ్బంది, మరియు జిల్లా పోలీస్ కళాబృందం సభ్యులు రాంచెందర్, రోహిత్, చంద్రశేఖర్, శ్రీనివాస్, రజిత, సంఘువి తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: సబ్ కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చిన రైతులు
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం గోపిశెట్టి పల్లి గ్రామ సమీపంలో పెప్పర్ మోషన్ ఎలక్ట్రికల్ బస్సుల...
By Kothuru Murali 2026-05-26 11:29:02 0 112
Andhra Pradesh
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం
మార్కాపురం కలెక్టరేట్లో ఈ నెల22వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఉదయం 1౦గంటల...
By Chennaiah Kati 2026-06-21 13:49:48 0 111
Andhra Pradesh
గుడిసెవారిపల్లెలో బైక్ దగ్ధం : ఉద్రిక్తత.
మదనపల్లె మండలం గుడిసివారి పల్లెలో ఆదివారం రెండు వర్గాల మధ్య వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది....
By Pagadala Venkateswar 2026-04-13 05:42:03 0 175
Telangana
చినరాయుని చెరువులో నీటి కలుపు తొలగింపు.|
"ఆలస్యానికి తావు లేకుండా పనులు పూర్తిచేయాలని కాంట్రాక్టర్‌కు ఆదేశం" మేడ్చల్ మల్కాజ్గిరి :...
By Sidhu Maroju 2026-07-06 09:12:25 0 118
Andhra Pradesh
అయ్యప్ప స్వామి పుట్టినరోజు పురస్కరించుకొని అభిషేకాలు
విజయవాడ 01-04-2026    ప్రచురణార్థం    *బాబా ప్రశాంతి నిలయంలో అయ్యప్ప...
By Rajini Kumari 2026-04-01 09:16:50 0 200
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com