అంబేద్కర్ గౌరవాన్ని కించపరిస్తే సహించేది లేదు ఆసిఫాబాద్ సెంటర్ కమిటీ

0
87

• ఈ నెల 17న శాంతియుత ర్యాలీ

• ఆసిఫాబాద్ సీఐకి వినతిపత్రం అందజేత

🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్  ప్రతినిధి: ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఆసిఫాబాద్ సెంటర్ కమిటీ సంఘం సభ్యులు తీవ్రంగా ఖండించారు. హమారా ప్రసాద్ అనే వ్యక్తి అంబేద్కర్ గారిని అవమానించే విధంగా వ్యాఖ్యలు చేస్తూ రాసిన పుస్తకాన్ని, ఈ నెల 18న విడుదల చేయాలని నిర్ణయించడాన్ని వారు తీవ్రంగా తప్పుపట్టారు. ఇటువంటి వ్యాఖ్యలు కోట్లాది మంది ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఇలాంటి చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తామని, అంబేద్కర్ ఆలోచనలను, రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యత అని వారు స్పష్టం చేశారు. "అంబేద్కర్‌పై అవమానం అంటే రాజ్యాంగ విలువలపై దాడే" అని వారు పేర్కొన్నారు.

17న భారీ ర్యాలీ: ఈ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈ నెల 17వ తేదీ ఉదయం 11 గంటలకు లుంబిని దీక్షా భూమి నుండి అంబేద్కర్ చౌక్ వరకు శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు వెల్లడించారు. ఈ ర్యాలీకి తగిన అనుమతులు ఇవ్వడంతో పాటు, శాంతియుత నిరసనకు అవసరమైన పూర్తి సహకారం అందించాలని కోరుతూ ఆసిఫాబాద్ సెంటర్ కమిటీ సభ్యులు స్థానిక సీఐ గారికి వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో సెంటర్ కమిటీ ప్రతినిధులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

• అనుచిత వ్యాఖ్యలను ఖండిద్దాం...

• అంబేద్కర్ గౌరవాన్ని కాపాడుకుందాం...

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి: సచివాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే.
మదనపల్లి పట్టణంలోని సొసైటీ కాలనీ పార్క్ సమీపంలో ఉన్న సచివాలయాన్ని ఎమ్మెల్యే షాజహాన్ బాషా...
By Pagadala Venkateswar 2026-06-20 04:30:33 0 105
Telangana
నేరేడు పండ్లు కాశాయి.. ఇక వర్షాలు కష్టమేనా?"|
"నేరేడు పండ్లు ఎక్కువగా కాస్తే వర్షాలు పడవా? అపోహలపై నిపుణుల స్పష్టీకరణ" హైదరాబాద్ : ఈ ఏడాది పలు...
By Sidhu Maroju 2026-06-24 12:34:07 0 122
Andhra Pradesh
పుంగనూరు: కాలనీలో లోపించిన పారిశుధ్యం
పుంగనూరు పట్టణంలోని శుభారం ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ వద్ద ఉన్న కాలనీలో పారిశుద్ధ్యం లోపించిందని...
By Kothuru Murali 2026-04-13 08:25:59 0 134
Telangana
ఎండ వాన లెక్కచేయని మున్సిపల్, జీపీ కార్మికులు
కొంమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎండను, వానను లెక్కచేయకుండా, తెల్లవారకముందే విధులకు హాజరవుతూ వీధుల...
By Chunarkar Jagadeesh 2026-06-30 07:21:30 0 252
Andhra Pradesh
తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం గారి జన్మదిన వేడుకలు
21.12.2025 తాడేప‌ల్లి    - జ‌నం త‌ల‌రాత‌లు మార్చే...
By Rajini Kumari 2025-12-21 08:45:59 0 237
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com