ఇంటర్నేషనల్ అవార్డులకు కదిరి పాత్రికేయులు ఎంపిక

0
169

కదిరి: శ్రీ సత్యసాయి జిల్లా కదిరికి చెందిన పాత్రికేయులు కె. రామచంద్ర, ఎస్. బాబా ఫక్రుద్దీన్, టి.డి. జయరాంరెడ్డిలు బెంగళూరులోని ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ సంస్థ అందించే జాతీయ అవార్డులకు ఎంపికయ్యారు.ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ సంస్థ 14వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ అవార్డులకు వీరిని ఎంపిక చేసినట్లు సంస్థ అధ్యక్షులు సి.ఎస్. శివరాజ్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ నెల 12వ తేదీన బెంగళూరులోని అంబేద్కర్ భవన్‌లో నిర్వహించే అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో వీరిని ఘనంగా సత్కరించి పురస్కారాలను అందజేయనున్నారు.దీర్ఘకాలంగా పాత్రికేయ రంగంలో కొనసాగుతూ ప్రజా సమస్యలు, సామాజిక అంశాలపై కథనాలు అందిస్తున్న కదిరి పాత్రికేయులకు ఈ అవార్డులు దక్కడం పట్ల స్థానిక పాత్రికేయులు హర్షం వ్యక్తం చేశారు.చిక్‌బళ్లాపూర్ జిల్లా పాత్రికేయులు టి.ఎస్. నాగేంద్రబాబు, జయరామ్, వెంకటేష్, కృష్ణాచారి తదితరులు అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
చంద్రబాబు అడిగిన రాజకీయాల్లోకి రాను నారా బ్రాహ్మణి
*చంద్రబాబు అడిగినా రాజకీయాల్లోకి రాను: నారా బ్రాహ్మణి*   రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదన్న...
By Rajini Kumari 2025-12-16 09:40:33 0 191
Telangana
నిజామాబాద్: మే 1 నుoడి నిబంధ అమలు సిపి సాయి చైతన్య
నిజామాబాద్ జిల్లా ప్రజలు ఈ క్రింది నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని  నిజామాబాద్ CP పి. సాయి...
By Sadaq Sadaq 2026-05-01 07:07:57 0 176
Telangana
పలు ఆలయాలను సందర్శించుకున్న కార్పొరేటర్ రాజ్ జితేంద్ర నాథ్
మల్కాజ్గిరి జిల్లా / అల్వాల్ బోనాల పర్వదినాన్ని పురస్కరించుకొని మచ్చబొల్లారం, హరిజన బస్తీ,...
By Sidhu Maroju 2025-07-20 14:34:23 0 1K
SURAKSHA
K. Lalthawmmawia: Leading Mizoram with Vision and Integrity
A dedicated 2007-batch IAS officer of the AGMUT Cadre, K. Lalthawmmawia serves as Commissioner...
By Lokeshwari Panthadi 2026-07-23 11:30:21 0 152
Bharat
Rise of the Cockroach Janta Party: Gen Z's Viral Revolt
An unprecedented internet phenomenon has shaken India’s digital landscape. The "Cockroach...
By Dunna Jessicaruth 2026-05-26 09:13:46 0 599
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com