ఫార్మ్ పాండ్స్, వీడ్ మ్యాట్‌తో పంట సంరక్షణ

0
182

భారత్ ఆవాజ్ న్యూస్:నల్లచెరువు మండలం ఉద్యాన పంటల్లో నీటి కొరతను అధిగమించి సాగు వ్యయాన్ని తగ్గించేందుకు రైతులు ఫార్మ్ పాండ్స్, డ్రిప్ ఇరిగేషన్, వీడ్ మ్యాట్‌ను సద్వినియోగం చేసుకోవాలని మండల ఉద్యానశాఖ అధికారి కుమారి లావణ్య సూచించారు.ఫార్మ్ పాండ్స్‌లో నీటిని నిల్వ చేసి డ్రిప్ ద్వారా పంటలకు అందించవచ్చని తెలిపారు. మామిడి, చీని, దానిమ్మ వంటి పంటల్లో వీడ్ మ్యాట్‌ను వినియోగించడం ద్వారా కలుపు నియంత్రణతో పాటు నేలలో తేమను కాపాడి నీటి ఆవిరీభవనాన్ని తగ్గించవచ్చన్నారు.20×20×3 మీటర్ల ఫార్మ్ పాండ్‌కు యూనిట్ ఖర్చు ₹1.80 లక్షలు కాగా, ప్రభుత్వ రాయితీ ₹90 వేలుగా ఉందని పేర్కొన్నారు. వీడ్ మ్యాట్‌కు చదరపు మీటరుకు ₹25 ధరలో ₹12.50 రాయితీ, గరిష్ఠంగా 4,000 చదరపు మీటర్ల వరకు అర్హత ఉందన్నారు.ఈ సాంకేతిక పద్ధతులతో నీటి పొదుపు, కూలీల వ్యయ నియంత్రణతో పాటు పంటల దిగుబడి, నాణ్యత మెరుగుపడే అవకాశం ఉందని లావణ్య తెలిపారు. నల్లచెరువు మండల రైతులు ఉద్యానశాఖ రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

Search
Categories
Read More
Telangana
కార్మికులకు గుడ్ న్యూస్.. కనీసవేతనం .20,000
    TG: పరిశ్రమల్లో పనిచేసే 1.11కోట్ల మంది కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ నిర్ణయం...
By Midathapalli Kiran Kumar 2026-05-22 07:52:27 0 281
Andhra Pradesh
International women's day
అమరావతి పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు...
By G k Nookala 2026-03-08 12:05:35 0 256
Andhra Pradesh
నేడు జిల్లా కలెక్టరేట్ లో ప్రజా ఫిర్యాదుల పరిస్కార వేదిక (PGRS) అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు పి జి ఆర్ ఎస్ కు హాజరు కావాలి
బాపట్ల: ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించే పి జి ఆర్ ఎస్...
By Gadiyapudi Narendra 2026-02-02 13:31:08 0 230
Andhra Pradesh
ఇది చూడండి
16 ఏళ్లలోపు వారిని సోషల్ మీడియా యాప్‌ల నుండి నిషేధించే ఆస్ట్రేలియా చారిత్రాత్మక చట్టాన్ని,...
By Thokala Sivaji 2026-03-28 06:10:03 0 751
Andhra Pradesh
పుంగనూరు:నేడు కేసుల పరిష్కారానికి లోక్‌అదాలత్
పుంగనూరు పట్టణ కోర్టు ఆవరణంలో శనివారం జాతీయ లోక్‌అదాలత్ నిర్వహిస్తున్నట్లు సీనియర్ సివిల్...
By Kothuru Murali 2026-07-11 15:50:47 0 158
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com