ప్రజా సమస్యలు తీర్చండి, ఏఐ వాడండి.. పనిచేసే వారికే ప్రోత్సాహం: కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు.

0
73

ప్రభుత్వ పాలనలో ప్రజా సంతృప్తే పరమావధిగా పనిచేయాలని, దీనికోసం ఆధునిక టెక్నాలజీని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న ఆయన.. ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, పాలనలో టెక్నాలజీ వినియోగం, ప్రజల్లో ప్రభుత్వంపై సానుకూల దృక్పథం పెంపొందించడం అనే మూడు కీలక అంశాలపై ప్రధానంగా దృష్టి సారించారు. క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారంతో పాటు ప్రభుత్వ పథకాలు ప్రజలకు సులభంగా చేరినప్పుడే వాటికి సార్థకత లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. "ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)కు వచ్చే దరఖాస్తులను ప్రజలకు పూర్తి సంతృప్తి కలిగేలా పరిష్కరించాలి. ఇందుకోసం జిల్లా స్థాయిలో కలెక్టర్లు, నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, మండల స్థాయిలో అధికారులు తరచూ గ్రామాల్లో పర్యటించాలి. ఇలా నెలకు నాలుగుసార్లు క్షేత్రస్థాయికి వెళ్తే చాలా సమస్యలు అక్కడికక్కడే పరిష్కారమవుతాయి. ఈ పర్యటనల వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలి" అని ఆదేశించారు.

Search
Categories
Read More
Telangana
కార్పొరేషన్ సమీక్ష సమావేశం లో పాల్గొన్న మంచిర్యాల మేయర్ ధర్ని మధుకర్
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 15 వ డివిజన్ లో ఏర్పాటు చేసిన డివిజన్ సమీక్షా సమావేశంలో...
By Avunoori Mahesh 2026-04-25 07:42:53 0 166
Andhra Pradesh
పారిశ్రామికవేత్తలకు ప్రముఖులకు ఎంపీ కేసినేని శివనాద్ పిలుపు
*ప్ర‌చుర‌ణార్థం* *21-12-2025*   ఎన్టీఆర్ జిల్లాను పేద‌రికం లేని జిల్లాగా...
By Rajini Kumari 2025-12-22 07:34:38 0 237
Telangana
సీనియర్ నేత, వి హనుమంతరావుకు ప్రభుత్వ బిసి సంక్షేమ శాఖ సలహాదారులు పదవి
సీనియర్ నేత, కాంగ్రెస్ పార్టీలో బిసి అగ్ర నాయకుడు వి. హనుమంతరావుకు ప్రభుత్వ బిసి సంక్షేమ శాఖ...
By Ponnala Srinivasrao 2026-05-01 02:56:45 0 167
Andhra Pradesh
మదనపల్లి : కోడలపై అత్తామామల దాడి.
మదనపల్లెలో బుధవారం నాడు జరిగిన ఘటనలో, నక్కలదిన్నె తండాకు చెందిన రవినాయక్ భార్య తన అత్తమామలు...
By Pagadala Venkateswar 2026-04-23 03:31:39 0 138
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com