జానకపూర్ వార్డుల్లో వినాయక చవితి ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ అంజయ్య

0
259

ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): త్వరలో రాబోయే వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ఆసిఫాబాద్ మున్సిపల్ కమిషనర్ అంజయ్య గారు జానకపూర్ పరిధిలోని 1వ మరియు 14వ వార్డులలో విస్తృతంగా పర్యటించారు. పండుగ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ముందస్తుగా చేపట్టాల్సిన అన్ని రకాల ఏర్పాట్లను ఆయన స్వయంగా దగ్గరుండి పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ. వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంతంగా, వైభవంగా జరిగేలా మున్సిపాలిటీ తరపున అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి ఒక్క ఏర్పాటూ సరిగ్గా జరిగేలా అధికారులు, సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తారని కౌన్సిలర్లకు, వార్డు ప్రజలకు హామీ ఇచ్చారు.

ఈ క్షేత్రస్థాయి పరిశీలన కార్యక్రమంలో 1వ వార్డు కౌన్సిలర్ జాడి వినోద్ కుమార్, 14వ వార్డు కౌన్సిలర్ కె. భారతి గారు, వార్డు ఆఫీసర్ రామయ్య, మున్సిపల్ సిబ్బందితో పాటు స్థానిక వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి మదనపల్లెలో విజయోత్సవ సభ.
మదనపల్లెలో గురువారం ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా...
By Pagadala Venkateswar 2026-06-19 04:33:53 0 122
Telangana
బీజేపీ లో కుడా క్రమశిక్షణ లేని నాయకులు,పుత్ర రత్నాలు ఉన్నారంటే ఇనుముకు చెద పట్టినట్టే......
భార్య పుస్తెలు అమ్మి ఎన్నికల్లో పోటీ చేశానంటూ బండి సంజయ్ సిగ్గులేకుండా దగుల్బాజీ కబుర్లు...
By Ponnala Srinivasrao 2026-05-10 01:52:56 0 159
Telangana
ఖమ్మం టు కోదాడ హైవేపై కారు - బైక్ ఢీ...
నేలకొండపల్లి: పైనంపల్లి - శాంతినగర్ మధ్య హైవేపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు...
By Krishna Balina 2026-02-15 11:11:31 0 520
Andhra Pradesh
చీరాలలో దివ్యాంగుల గర్జన * సొంత ఇళ్లు కల్పించాలని ప్రభుత్వానికి విన్నపం
చీరాల పట్టణంలోని ఎన్.ఆర్.పి.ఎం హైస్కూల్ ఆవరణలో గల ఓపెన్ ఎయిర్ థియేటర్ లో దివ్యాంగుల పోరాట సమితి...
By Vadlamudi NagaVenkat 2026-03-07 16:54:31 0 564
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com