కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి: శ్రీగణేష్.|

0
130

● ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్‌ మహా ధర్నా

● బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో జరగని అభివృద్ధి.. కాంగ్రెస్‌ 1000 రోజుల్లో జరిగిందన్న శ్రీగణేష్

● కంటోన్మెంట్‌ నుంచి భారీగా తరలివచ్చిన కాంగ్రెస్‌ శ్రేణులు

అల్వాల్, సెప్టెంబర్ 6: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ టీపీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన మహా ధర్నాలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పాల్గొన్నారు. 

కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆయన వెంట తరలివచ్చారు.

ఈ సందర్భంగా శ్రీగణేష్ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో లేకుండా, అసెంబ్లీకి హాజరు కాకుండా ఎమ్మెల్యేగా కొనసాగడం సరికాదన్నారు.

ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 

బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో జరగని అభివృద్ధి, రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో సాధ్యమైందని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ ప్రజా పాలనలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు, రైతు సంక్షేమం, విద్య, వైద్యం తదితర రంగాల్లో పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు.

మహా ధర్నాలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
అధ్యాపక పోస్టుల భర్తీ వేగవంతం చేయండి: అధికారులకు మంత్రి లోకేష్ ఆదేశం.
  అధ్యాపక పోస్టుల భర్తీ వేగవంతం చేయండి: అధికారులకు మంత్రి లోకేష్ ఆదేశం   Andhra...
By Pagadala Venkateswar 2026-06-26 05:17:17 0 96
Andhra Pradesh
సామర్లకోట: హై వోల్టేజ్ త్రీఫేజ్ పవర్ సరఫరా కట్
సామర్లకోట పట్టణంలో హై వోల్టేజ్ కారణంగా విద్యుత్ పరికరాలు పలుచోట్ల భారీ నష్టం వాటిల్లింది. స్థానిక...
By Ratna Sekhar 2026-02-11 14:26:06 0 382
Telangana
టీఆర్ఎస్ పేరు మార్చుకోవాల్సిందే
కవిత కొత్త పార్టీ తెలంగాణ రక్షణ సేనపై ఎన్నికల సంఘం ఆదేశాలు ‎15 రోజుల్లో మూడు ప్రత్యామ్నాయ...
By Ponnala Srinivasrao 2026-07-04 16:31:00 0 181
SURAKSHA
Sunil Kumar: The IPS Officer Who Led Bihar with Resolve
The Journey Begins "Strong policing is built not only on enforcement but also on...
By Fathima Safa 2026-08-03 07:14:10 0 326
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com