నమ్మకమే పెట్టుబడి.. 48 తులాల బంగారం మాయం.|

0
137

● ఆనంద్‌బాగ్ ఎస్‌బీఐ అపార్ట్‌మెంట్‌లో భారీ చోరీ

● రెండు ఫ్లాట్ల నుంచి సుమారు 48 తులాల బంగారం అపహరణ

● ఏప్రిల్‌లో అకస్మాత్తుగా వెళ్లిపోయిన నేపాలీ కుటుంబంపై అనుమానం

ఆల్వాల్, సెప్టెంబర్ 6: ఏళ్ల తరబడి అపార్ట్‌మెంట్‌లో ఉంటూ వాసుల నమ్మకాన్ని పొందిన నేపాలీ కుటుంబం అకస్మాత్తుగా వెళ్లిపోయిన తర్వాత భారీ బంగారం చోరీ వెలుగులోకి వచ్చింది.

మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆనంద్‌బాగ్ ఎస్‌బీఐ అపార్ట్‌మెంట్‌లోని 301, 302 ఫ్లాట్ల నుంచి సుమారు 48 తులాల బంగారం మాయమైనట్లు గుర్తించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

సదరు కుటుంబం దాదాపు 11 ఏళ్లుగా అపార్ట్‌మెంట్‌లో పనిచేస్తూ అక్కడే నివసించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కుటుంబ పెద్ద అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన భార్య నలుగురు పిల్లలతో కలిసి వాచ్‌మన్ బాధ్యతలు కొనసాగించినట్లు సమాచారం.

దీర్ఘకాలంగా అక్కడే ఉండటంతో అపార్ట్‌మెంట్ వాసులతో వారికి సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి.

ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆ కుటుంబం ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అపార్ట్‌మెంట్‌ను ఖాళీ చేసి వెళ్లిపోయింది.

అనంతరం అనుమానం వచ్చిన బాధితులు తమ ఇళ్లలోని లాకర్లను పరిశీలించగా బంగారు ఆభరణాలు కనిపించలేదు. రెండు ఫ్లాట్ల నుంచి కలిపి సుమారు 48 తులాల బంగారం మాయమైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు ఆధారంగా మల్కాజిగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబం ఎక్కడికి వెళ్లింది, బంగారం ఆచూకీ ఏమిటి, ఈ ఘటనలో మరెవరైనా ప్రమేయం ఉందా అనే కోణాల్లో విచారణ సాగుతోంది. 

అనుమానితుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగినట్లు సమాచారం.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Telangana
మల్కాజ్‌గిరిలో ఉద్రిక్తత… ఫుట్‌పాత్ షాపుల తొలగింపు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: మల్కాజిగిరి పరిధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి....
By Sidhu Maroju 2026-04-08 12:04:37 0 222
Telangana
పట్టాభిషిక్తుడైన భద్రాద్రి రామయ్య...
భద్రాచల శ్రీరాముల వారి పట్టాభిషేకం శనివారం వైభవంగా జరిగింది. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం...
By Krishna Balina 2026-03-28 14:32:53 0 442
Telangana
బీసీల సమగ్ర కుల గణన చేపట్టాలి బీసీ సంక్షేమ సంఘం డిమాండ్
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ): దేశవ్యాప్తంగా చేపట్టే జనగణనలో బీసీల సమగ్ర కుల గణనను...
By Chunarkar Jagadeesh 2026-08-24 23:51:52 0 278
Andhra Pradesh
పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న గద్దె రామ్మోహన్
ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం -ఏపీఐఐసీ కాలనీలో పల్స్ పోలియో కార్యక్రమంలో...
By Rajini Kumari 2025-12-21 12:30:02 0 273
Telangana
నిజామాబాద్: ఎడపల్లిలో తైబజార్ వేలుమ్ రద్ధు.
ఎడపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఇటి వల నిర్వాహిoచిన తైబజార్ వెలాన్నీ అధికారులు రాధుచేషారు. ఇమెరాకు...
By Sadaq Sadaq 2026-04-07 17:48:03 0 217
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com