Bharat Aawaz

భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయంలో మంత్రుల ప్రత్యేక పూజలు

Benguluri Madhubabu
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
2 min read
0
Comments
299
Views

 

 

*అన్నమయ్య జిల్లా | సెప్టెంబర్ 05, 2026*

 

శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ *మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు*, అన్నమయ్య జిల్లా ఇన్‌చార్జి *మంత్రి శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారు*, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి *శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు* ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

 

ఆలయానికి విచ్చేసిన మంత్రులకు *ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు*. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాది కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా *రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో,* పాడిపంటలతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించారు.

 

భక్తిశ్రద్ధలతో నిర్వహించిన పూజా కార్యక్రమంలో మంత్రులు పాల్గొనడంతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసి, వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వదించారు.

 

ఈ కార్యక్రమంలో *కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి గారు, జోనల్ కోఆర్డినేటర్ దామలచెర్ల సత్య గారు, అబ్జర్వర్ అనిత యాదవ్ గారు* తదితర ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.