సీఎం సార్ మా డబ్బులు మాకు ఇవ్వండి బాపట్ల కలెక్టరేట్‌ వద్ద ఉద్యోగుల నిరసన న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్‌

0
119

బాపట్ల 

ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి సంబంధించిన పెండింగ్‌ బకాయిలు, న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ‘‘సీఎం సార్‌ మా డబ్బులు మాకు ఇవ్వండి’’ అంటూ నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు.

ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఏపీ జేఏసీ అమరావతి ప్రకటించిన దశలవారీ ఉద్యమ కార్యాచరణలో భాగంగా బాపట్ల జిల్లాలోనూ నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే జిల్లా జేఏసీ నాయకులు, ఉద్యోగులు కలిసి జిల్లా కలెక్టర్‌కు ఉద్యమ కార్యాచరణ నోటీసును అందజేశారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే సానుకూల నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు. పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలు, పీఆర్సీ, మధ్యంతర భృతి (ఐఆర్‌), ఇతర ఆర్థిక ప్రయోజనాలను విడుదల చేయాలని ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. తమకు రావాల్సిన బకాయిల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందని, ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో పరిష్కరించాలని కోరారు. ఉద్యోగుల సంఘాల ప్రకారం బకాయిల మొత్తం భారీ స్థాయిలో ఉందని వారు పేర్కొంటున్నారు.

‘‘ఉద్యోగులు ప్రభుత్వం నుంచి గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు.. తమకు రావాల్సిన డబ్బులు, న్యాయమైన హక్కులు మాత్రమే కోరుతున్నారు’’ అని జేఏసీ నాయకులు పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు జరిపి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు.

ఉద్యమంలో భాగంగా సెప్టెంబర్‌ 1 నుంచి 5వ తేదీ వరకు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతున్నారు. అలాగే ‘‘సీఎం సార్‌0 మా డబ్బులు మాకు ఇవ్వండి’’ అనే నినాదాన్ని వాట్సాప్‌ డీపీలు, స్టేటస్‌ల ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నారు. సెప్టెంబర్‌ 3, 5 తేదీల్లో కలెక్టరేట్లు, ఆర్డీవో కార్యాలయాల వద్ద భోజన విరామ సమయంలో నిరసనలు చేపట్టేలా కార్యాచరణ రూపొందించారు.

 

ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని జేఏసీ నాయకులు డిమాండ్‌ చేశారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో దశలవారీగా ఉద్యమాన్ని కొనసాగిస్తామని, ప్రభుత్వం స్పందించకపోతే తదుపరి దశలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.

Search
Categories
Read More
Telangana
అభివృద్ధిలో మంచిర్యాల రోల్ మోడల్ : డిప్యూటీ సీఎం
మంచిర్యాల నియోజకవర్గ రాష్ట్రానికే రోల్ మోడల్ గా నిలుస్తుందని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. ఆదివారం...
By Bonagiri RaviShankar 2026-06-14 13:37:37 0 231
Andhra Pradesh
Ayyanna Patrudu: సభకు రాకుండా రోడ్లపై మాట్లాడతారేంటి?: స్పీకర్ అయ్యన్నపాత్రుడు.
రాష్ట్రం, ప్రజల పక్షాన నిజంగా చర్చించాలనుకుంటే వారు సభకు రావాలన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు సభలో...
By Pagadala Venkateswar 2026-02-07 07:36:26 0 211
Gujarat
Gujarat Strengthens Education and Health Infrastructure Growth
Gujarat is making significant progress in strengthening its education and health infrastructure...
By Fathima Safa 2026-06-29 12:42:29 0 119
SURAKSHA
Guardian of Justice: The Inspiring Journey of IPS Jatin Narwal
Integrity, Empathy, and Decisive Leadership at the Forefront of Indian Policing In the demanding...
By Kalaga Sailaja 2026-07-28 09:53:36 0 170
Sports
BACK-TO-BACK CENTURIES FROM CAPTAIN GILL!
The Indian skipper is in fine form as he scores his 2nd century of the tour! Take a bow, Shubman...
By Bharat Aawaz 2025-07-02 17:50:04 0 3K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com