పండగ వేళ విషాదం.. కరెంట్ షాక్ తో బాలిక మృతి..! కరెంట్ షాక్ తో ఓ బాలిక మృత్యువాత పడిన ఘటన స్థానికంగా అందరినీ కన్నీరు పెట్టిస్తోంది....

0
149

 భారత్ అవాజ్ న్యూస్:- సెప్టెంబర్ 5 తేదీన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం లో కరెంట్ షాక్ తో ఓ బాలిక మృత్యువాత పడిన ఘటన స్థానికంగా అందరినీ కన్నీరు పెట్టిస్తోంది.నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన పిట్టల రమేష్ కూతురు పిట్టల సిరివెన్నెల (14) కృష్ణాష్టమి నేపథ్యంలో ఉదయాన్నే స్నానం చేయడానికి వెళ్ళింది. మోటార్ ఆన్ చేయడానికి స్విచ్ వేయడంతో కరెంట్ షాక్ కి గురైంది. అప్పటికే ఎలుకలు వైర్లను కొట్టివేయడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన కూతురును చూసి కంగారు పడిన తండ్రి వెంటనే 108 కి సమాచారం అందించారు. సంఘటనాస్థలికి చేరుకున్న ఈ.ఏం.టీ దస్రు సీ.పీ.ఆర్ చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. మృతి చెందినట్లు సిబ్బంది తెలిపారు. ఈ రోజు స్కూల్ ఉన్నా పాప బతికేది అంటూ తండ్రి చేస్తున్న ఆర్త నాదాలు స్థానికులను కన్నీరు పెట్టించాయి. సిరివెన్నెల స్థానిక స్థానిక ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నట్లు సమాచారం. క్షణాల వ్యవధిలో విగత జీవిగా మారిన కూతురును చూసి బాధిత కుటుంబం రోదించడంతో నల్లబెల్లి లో పండగ వేళ విషాద ఛాయలు అలుముకున్నాయి... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము...

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: పుంగునూరు సమీపంలో లారీ ఢీకొని వ్యక్తి మృతి
అన్నమయ్య జిల్లా  పుంగనూరు మండల సమీపంలోని బటందొడ్డి దొడ్డి మలుపు వద్ద శుక్రవారం ఘోర రోడ్డు...
By Kothuru Murali 2026-02-07 06:54:54 0 183
Andhra Pradesh
*నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై పొగమంచు.. పదుల సంఖ్యలో వాహనాలు ఢీ*
ఉత్తరాదిలో వాయు కాలుష్యం (Air pollution) తీవ్రత కొనసాగుతోంది. గాలి నాణ్యతా సూచీ (AQI) ప్రమాదకర...
By SivaNagendra Annapareddy 2025-12-13 07:59:39 0 496
Telangana
నిజామాబాద్
పార్లమెంట్ పరిధిలోని వివిధ సంఘాల నాయకులు, పార్టీ నాయకులు ఈ రోజు నన్ను కలువడం జరిగింది.ఈ సందర్భంగా...
By Sadaq Sadaq 2026-05-18 09:02:28 0 129
Andhra Pradesh
నిరంతరాయమైన విద్యుత్ ను అందిచడమై లక్ష్యం విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే MMకొండయ్య.
చీరాల: విద్యుత్ రంగానికి కూటమి సర్కార్ పెద్ద పీట. నూతనంగా నిర్మించనున్న విద్యుత్...
By Gadiyapudi Narendra 2026-02-18 15:57:06 0 221
Telangana
ఉచిత అంబలి కేంద్రాలను ప్రారంభించిన మాజీ డీసీసీ అధ్యక్షురాలు : కొక్కిరాల సురేఖ
కీ,, శే శ్రీ కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల...
By Avunoori Mahesh 2026-04-26 12:52:01 4 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com