0
Comments
167
Views
ఎన్నికల సన్నద్ధత, భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయంపై విస్తృత చర్చ
క్షేత్రస్థాయిలో ఐక్యంగా పనిచేయాలని నాయకుల నిర్ణయం
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తీర్మానం
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఎన్డీయే కూటమి సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో భాగస్వామ్య పక్షాల సమన్వయ కమిటీ కీలక సమావేశం నిర్వహించింది. ఎన్నికల వ్యూహాలు, క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన కార్యాచరణపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు.
ఎన్నికల సన్నద్ధత, భాగస్వామ్య పార్టీల మధ్య సమన్వయం, నాయకులు-కార్యకర్తల మధ్య ఐక్యత వంటి అంశాలు ఈ భేటీలో ప్రధాన అజెండాగా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థుల విజయాన్ని లక్ష్యంగా చేసుకుని పక్కా కార్యాచరణతో ముందుకు సాగాలని నాయకులు నిర్ణయించారు. గ్రామ, మండల స్థాయిలలో కూటమి నేతలంతా సమన్వయంతో పనిచేయాలని తీర్మానించారు.