Madanapalle: ఏపీ పోలీస్ తొలి రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో మదనపల్లె కానిస్టేబుల్ శశికళ రెండు స్వర్ణాలతో సహా ఐదు పతకాలు సాధించి సంచలనం సృష్టించారు.

0
104

Madanapalle: ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ తొలిసారిగా నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో అన్నమయ్య జిల్లా మదనపల్లి శక్తి టీమ్ కు చెందిన శశికళ కళ అసాధారణ ప్రతిభ కనబరిచి ఐదు పతకాలతో చరిత్ర సృష్టించింది. అమరావతి సమీపంలోని VIT-AP యూనివర్సిటీలో జరిగిన 1st AP State Police Sports & Games Meet-2026 లో కర్నూలు రేంజ్ తరపున బరిలోకి దిగిన శశికళ, పలు విభాగాల్లో తన పటిమ చూపింది.

 

రెండు స్వర్ణాలు, ఒక కాంస్యం:

 

వ్యక్తిగత విభాగాల్లో ఆమె తిరుగులేని ఆధిపత్యం చాటింది. హ్యాండ్ రెజ్లింగ్ (ఆర్మ్ రెజ్లింగ్) లో బలమైన ప్రత్యర్థులను సునాయాసంగా ఓడించి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. అదే జోష్ తో బాక్సింగ్ రింగ్ లోకి దిగి పంచ్ ల మీద పంచ్ లు కురిపిస్తూ రెండో గోల్డ్ మెడల్ ను తన ఖాతాలో వేసుకుంది. మహిళా రెజ్లింగ్ విభాగంలోనూ అద్భుతంగా పోరాడి కాంస్య పతకం (3వ స్థానం) సాధించింది.

 

జట్టు క్రీడల్లోనూ సత్తాచాటారు:

 

జట్టు క్రీడల్లో కూడా తన జట్టుకు వెన్నుదన్నుగా నిలిచింది. కర్నూలు రేంజ్ మహిళా బాస్కెట్ బాల్ జట్టు రాష్ట్రస్థాయిలో రన్నరప్ గా నిలవడంలో కీలక పాత్ర పోషించింది. అలాగే మహిళా హ్యాండ్ బాల్ జట్టు 3వ స్థానం సాధించడంలో తనవంతు కృషి చేసింది.

Search
Categories
Read More
Andhra Pradesh
వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వైఎస్ఆర్‌సీపీ ప్రతిఘటన!
వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వైఎస్ఆర్‌సీపీ ప్రతిఘటన ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ స్థాయి...
By Bharat Aawaz 2025-09-20 10:13:54 0 1K
Telangana
అంబేద్కర్ జయంతి సందర్బంగా ఘన నివాళులు అర్పించిన ఎంమ్మెల్యే : గడ్డం వినోద్ వెంకటస్వామి
 బెల్లంపల్లి : అంబేద్కర్ స్ఫూర్తితో సమానత్వ సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలి: ఎమ్మెల్యే ...
By Avunoori Mahesh 2026-04-14 08:29:40 0 249
Telangana
పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారి సస్పెన్షన్.
ఏసీబీ ఆకస్మిక తనిఖీల్లో అవకతవకలు వెలుగులోకి రావడంతో పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారి కే.అలివేణిని...
By MOHAMMAD MUJEEBUDDIN 2026-02-25 23:21:44 0 1K
Telangana
మంచిర్యాల: మాదిక దవ్యాలు కు వ్యతిరేకంగా భారీ ర్యాలీ
అంతర్జాతీయ మాదికి దవ్యాల నిరోధిక దినోత్సవం సందర్భంగా మంచిర్యాల్ బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ నుంచి...
By Bonagiri RaviShankar 2026-06-26 08:37:18 0 251
Andhra Pradesh
క్రిస్మస్ వేడుకలకు ఆహ్వానించిన పోతిన మహేష్ అండ్ టీం చార్లెస్ పిజా కబ్
మనకు ఎన్ని శక్తి సామర్థ్యాలు ఉన్న దానికి ఒక పరిమితి ఉంటుంది ఆ పరిమితిలోకి భగవంతుని...
By Rajini Kumari 2025-12-25 11:15:30 0 290
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com