వ్యవసాయ రంగాన్ని కాంగ్రెస్ నాశనం చేసిందని బిఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి

0
461

🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలనలో తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగం పూర్తిగా విచ్ఛిన్నమైందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కొమరం భీం జిల్లా మోవాడ్‌లో బిఆర్ఎస్ (BRS) ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని, రాష్ట్రవ్యాప్తంగా యూరియా కొరత వేధిస్తోందని ఆమె ఆరోపించారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన రైతుబంధు, పథకాన్ని ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆమె మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతలు కావాలనే విషప్రచారం చేస్తున్నారని, అలాగే భూభారతి, పేరుతో భూములకు నోటీసులు జారీ చేస్తూ అమాయక రైతులను  మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ అలీభాయ్, మున్సిపల్ చైర్మన్ మొంగ్రే ఆకాశ్, రాజంపేట సర్పంచ్ పోషన్న, గంధం శ్రీనివాస్‌తో పాటు పెద్ద సంఖ్యలో స్థానిక రైతులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
రీసర్వేలో నిర్లక్ష్యం వద్దు: ఎమ్మార్వో
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లె ఎమ్మార్వో కార్యాలయంలో ఎమ్మార్వో పార్వతి సోమవారం మండల వీఆర్వోలు,...
By Kothuru Murali 2026-01-13 09:00:49 0 217
Andhra Pradesh
చిన్నపాటి వర్షానికే 'ద్వీపం'లా గానుగపెంట: ఎంట్రీ రోడ్డుపై చెరువు నీరు... ఊళ్లోకి వెళ్లాలంటే ప్రాణాలు గుప్పిట్లోనే!
కొండాపురం (నెల్లూరు జిల్లా): మండల పరిధిలోని గానుగపెంట గ్రామ ప్రవేశ మార్గం గుంతలమయంగా మారి...
By VALLERU SIMHADRI 2026-09-15 17:22:44 0 148
Telangana
శామీర్ పేట ORR పై రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి
మేడ్చల్‌–మల్కాజ్‌గిరి జిల్లాలోని శామీర్‌పేట సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై కారు...
By Ponnala Srinivasrao 2026-03-17 01:52:41 0 293
Andhra Pradesh
Tirumala: తిరుమల భక్తులకు అప్‌డేట్: శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..!
  Tirumala: తిరుమల భక్తులకు అప్‌డేట్: శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..!...
By Pagadala Venkateswar 2026-02-28 08:41:21 0 365
Telangana
అంబేద్కర్ గౌరవాన్ని కించపరిస్తే సహించేది లేదు ఆసిఫాబాద్ సెంటర్ కమిటీ
• ఈ నెల 17న శాంతియుత ర్యాలీ • ఆసిఫాబాద్ సీఐకి వినతిపత్రం అందజేత 🎤ఆసిఫాబాద్ భారత్...
By Chunarkar Jagadeesh 2026-09-15 13:37:59 0 89
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com