ఘనంగా దివంగత నేత స్వర్గీయ డా: వై, ఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి!

0
162

చింతూరు మండలంలో స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమాన్ని చింతూరు మండల కమిటీ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిమ్మలగూడెం నుంచి చింతూరు, చట్టి మీదుగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఘన నివాళులు అర్పించారు. అనంతరం చింతూరు సెంటర్లోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ప్రజా సేవలను, పేదలు మరియు సామాన్య ప్రజల సంక్షేమం కోసం చేసిన కృషిని నాయకులు ఈ సందర్భంగా స్మరించుకున్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలని పలువురు నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం సందర్భంగా చింతూరు మండలంలో అభిమానులు, కార్యకర్తల సందడి నెలకొంది. చింతూరు మండల కమిటీ సభ్యులు మరియు కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.

 

# Yadagiri 

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఐజీ
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్‌లో బుధవారం కర్నూల్ రేంజ్ డీఐజీ కోయ...
By Kothuru Murali 2026-04-30 11:24:21 0 135
Andhra Pradesh
ఏపీ హైకోర్టు సీజేకు జడ్ ప్లస్ భద్రత.. గ్రీన్ ఛానల్ ఏర్పాటుకు ఆదేశాలు.
ఏపీ హైకోర్టు సీజేకు జడ్ ప్లస్ భద్రత.. గ్రీన్ ఛానల్ ఏర్పాటుకు ఆదేశాలు 13-05-2026 Wed 08:36 |...
By Pagadala Venkateswar 2026-05-13 06:08:46 0 150
Andhra Pradesh
పాలకుల నిర్లక్ష్యంతో వివేకానంద నగర్‌లో డ్రైనేజీ సమస్య.
పుంగనూరులో మినీ బైపాస్ రోడ్డులోని వివేకానంద నగర్‌లో డ్రైనేజీ సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు...
By Pagadala Venkateswar 2026-09-17 05:01:05 0 32
Telangana
నర్సు మృతి వెనుక మిస్టరీ.. తుక్కుగూడలో ఉద్రిక్తత.|
● సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఘటన.. ఆసుపత్రి గదిలో 21 ఏళ్ల యువతి మృతదేహం ● హత్య కోణంలో...
By Sidhu Maroju 2026-08-30 12:57:38 0 106
Telangana
కరీంనగర్ జిల్లా సంక్షేమ శాఖ సీనియర్ అసిస్టెంట్‌ను అరెస్ట్ చేసిన ఏసీబీ
కరీంనగర్ జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న దనుక రాధిక (44)...
By Ponnala Srinivasrao 2026-06-11 14:15:33 0 191
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com