1000 రోజుల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజల జీవితాలు ఛిద్రం: మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా

0
123

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 1000 రోజులు గడిచినా 6 గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయకుండా ప్రజల జీవితాలను ఛిద్రం చేసింది.

 

 • ప్రభుత్వానికి పని చేసేందుకు సమయం ఇచ్చినా మార్పు రాకపోవడంతో, అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు దిగాయి.

 

 • మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఆధ్వర్యంలో 420 హామీలతో కూడిన 420 అడుగుల భారీ ఫ్లెక్సీని ప్రజల ముందు ప్రదర్శించారు; ఈ నిరసనలు వారం రోజుల పాటు కొనసాగుతాయి.

 

 • ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కినందుకు సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పి, ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలి.

 

• కాంగ్రెస్ ఎగనామం పెట్టిన స్కీములు, నిధుల వివరాలతో కూడిన బాకీ కార్డులను 26వ డివిజన్ కోటగల్లిలో ఇంటింటికీ పంపిణీ చేశారు.

 

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయినా ప్రజల జీవితాలు ఛిద్రమయ్యాయని, ఎన్నికల హామీలను గాలికొదిలేసి రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజలను నిలువునా మోసం చేసిందని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే శ్రీ బిగాల గణేష్ గుప్తా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

 

అధికారంలోకి రావడానికి ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలు 1000 రోజులైనా అమలుకు నోచుకోలేదని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో కొత్తగా ఏర్పడిన ఏ ప్రభుత్వానికైనా పనిచేసేందుకు కొంత సమయం ఇవ్వాలనే సదుద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు ఇన్నాళ్లూ వేచి చూశారని గుర్తుచేశారు. అయినప్పటికీ ప్రజలను నిరంతరం మోసం చేస్తుండటంతో ఇక చూస్తూ ఊరుకోబోమని, కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని కేసీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారని తెలిపారు.

 

ఈ పిలుపులో భాగంగా నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే శ్రీ బిగాల గణేష్ గుప్తా గారి ఆధ్వర్యంలో నిజామాబాద్ లోని NTR చౌరస్తాలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 వాగ్దానాలను ఎండగడుతూ రూపొందించిన 420 అడుగుల భారీ ఫ్లెక్సీని ప్రజల సమక్షంలో ప్రదర్శించారు. ఈ ఆందోళన కార్యక్రమాలు వారం రోజుల పాటు కొనసాగుతాయని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పి, ఇచ్చిన అన్ని హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

 

అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఇస్తామని ఎగనామం పెట్టిన సంక్షేమ పథకాలు, లబ్ధిదారులకు రావాల్సిన డబ్బుల వివరాలను ‘బాకీ కార్డు’ రూపంలో రూపొందించారు. నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సిర్ప రాజు ఆధ్వర్యంలో 26వ డివిజన్ పరిధిలోని కోటగల్లి ప్రాంతంలో ఇంటింటికీ తిరిగి ఈ బాకీ కార్డులను పంపిణీ చేసి, కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు వివరించారు.

 

ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ దండు నీతు కిరణ్ శేఖర్,నగర అధ్యక్షులు సిర్ప రాజు,మాజీ NUDA చైర్మెన్ ప్రభాకర్ రెడ్డి, సత్య ప్రకాష్,నవీద్ ఇక్బాల్, జగత్ రెడ్డి,అబ్దుల్ మతీన్,బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు,డివిజన్ ఇంచార్జూలు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Search
Categories
Read More
SURAKSHA
Mastermind of Justice: The Legacy of Shri Ashish Bhatia
Unwavering Anti-Terror Fortitude, Tactical Precision, and Decades of Exemplary Leadership in Law...
By Kalaga Sailaja 2026-07-28 13:39:13 0 143
Andhra Pradesh
రైతుపై తేనెటీగల దాడి పరిస్థితి విషమం.
మదనపల్లె మండలంలో వేంపల్లికి చెందిన రెడ్డప్ప(56) అనే రైతుపై శుక్రవారం సాయంత్రం తేనెటీగలు దాడి...
By Pagadala Venkateswar 2026-04-25 04:47:08 0 137
Andhra Pradesh
బ్లాక్ స్పాట్స్ పరిశీలించిన అధికారులు
సాలూరులో తరచూ ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్ స్పాట్స్ను ట్రాన్స్పోర్ట్ పోలీస్, R&B అధికారులు...
By Boiena Rajesh 2026-04-09 01:17:22 0 200
Telangana
నిజామాబాద్
నిజామాబాద్ నగరంలో దొంగలహలచల్
By Sadaq Sadaq 2026-07-20 13:14:00 0 124
Andhra Pradesh
ఇజ్రాయిల్ మరియు అమెరికా స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్
ఇజ్రాయిల్ మరియు అమెరికా స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులు...
By Thokala Sivaji 2026-03-23 15:43:34 0 755
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com