ఉయిక శిరీష మృతికి కారణమైన నిందితులను తక్షణమే కఠినంగా శిక్షించాలని చింతూరులో గిరిజన సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ!

0
161

పోలవరం జిల్లా చింతూరు డివిజన్ కేంద్రంలో ఆదివాసి గిరిజన సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఉయిక శిరీష మృతికి కారణమైన నిందితులను తక్షణమే కఠినంగా శిక్షించాలని చింతూరులో గిరిజన సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ.  హైదరాబాదులోని తుక్కుగూడ కార్పొరేట్ ఆసుపత్రిలో ఏఎన్ఎం గా విధులు నిర్వహించి రెస్ట్ తీసుకుంటున్న ఆదివాసి మహిళ శిరీష హత్య అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదివాసి జేఏసీ ఆదివాసీ గిరిజన సంఘం ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగినది సోమవారం నాడు చింతూరు కేంద్రంలో ఆదివాసి జేఏసీ గిరిజన సంఘం ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కేంద్రం హైదరాబాద్లో మహిళలకు రక్షణ కరువైందని మారుమూల ప్రాంతాల నుండి ఉపాధి కొరకు కుటుంబ పోసన కోసమై నగరానికి వెళ్తే పని ప్రదేశంలో వేధింపులు మరియు హత్యలు హత్యాచారాలు జరగడం చాలా దుర్మార్గం అని శిరీష పై అత్యాచార ఘటనపై నిందితులను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కఠినంగా శిక్షించాలని మరియు మహిళలపై జరిగే ఘటనలపై శిక్షలు కఠిన తరం చేయాలని అన్నారు, ఈ ఘటన కేవలం ఒక ఆదివాసి మహిళపై కాదని సమాజంలోని మహిళలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఈ విషయంపై ప్రభుత్వం కఠినంగా స్పందించాలని కుటుంబానికి 20 లక్షల నష్టపరిహారాన్ని అందించి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు ఇలాంటి ఘటనపై సమాజంలో అందరూ కఠినంగా వ్యవహరించాలని సమాజంలో మద్యం మరియు డ్రగ్స్ విషయంపై కఠినంగా వ్యవహరించి బయట ప్రదేశంలో ఉన్న మహిళలకు రక్షణ కల్పించాలని అన్నారు హైదరాబాదులోని ప్రైమ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం సిబ్బందికి రక్షణ కల్పించే దాంట్లో నిర్లక్ష్యం ఫలితంగానే ఈ ఘటన జరిగిందని పని ప్రదేశంలో విశ్రాంతి గదులను ఏర్పాటు చేసి వారికి రక్షణ కల్పించాలని ఆ రకంగా చేయకపోవడం వల్లనే నిండు ప్రాణాలు బలి కావలసి వచ్చిందని తక్షణమే ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి ఈ ఘటనలో ఆసుపత్రి యాజమాన్యాన్ని కూడా నిందితులుగా చేర్చాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలోఆదివాసీ గిరిజన సంఘం నాయకులు సీసం సురేష్, ఆదివాసీ జేఏసీ నాయకులు జల్లి నరేష్, ఉద్యోగ సంఘాల నాయకులు పండా కృష్ణయ్య, తిమ్మ సాయి,తొడం దేశయ్య,మడివి రాధా,బొగ్గా ముత్తయ్య మొట్టుమ్ రాజయ్య, పొడియం రామకృష్ణ, మడివి రాజు, కారం. సాయి మడకం రమేష్ బంధం రాములమ్మ కాకా, రాజమ్మ, తదితరులు పాల్గొన్నారు.

 

# Yadagiri 

Search
Categories
Read More
Andhra Pradesh
Tirumala: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.
    Tirumala: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ 30-03-2026 Mon 19:15 | Both States...
By Pagadala Venkateswar 2026-03-31 03:44:37 0 353
Andhra Pradesh
తాడిపత్రి లో బైక్ ర్యాలీ
తాడిపత్రి పట్టణం లో హనుమాన్ జయంతి సందర్భంగా హిందూసోదరులు బైక్ ర్యాలీ నిర్వహించారు . ఇందులో ఆర్...
By Gitta Raju 2026-04-03 01:06:31 0 428
Andhra Pradesh
చంద్రబాబుది పచ్చి అవకాశవాద రాజకీయం మాజీ మంత్రి శైలజానాథ్ ధ్వజం
28.12.2025. అనంతపురం.   చంద్రబాబుది పచ్చి అవకాశవాద రాజకీయం అందుకే ఫ్లెక్సీలపై ఇప్పుడు...
By Rajini Kumari 2025-12-28 09:28:20 0 195
SURAKSHA
Beyond the Uniform: How Telangana Police Officers Transformed a Remote Village Through Compassion and Social Reform"
The police team stationed in the Mahabubabad district of Telangana has set an inspiring...
By Kalaga Sailaja 2026-06-23 10:48:04 0 260
Andhra Pradesh
మదనపల్లె: ఇంట్లో పాతిపెట్టిన బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం.
మదనపల్లె మండలం అంకిశెట్టిపల్లిలో శుక్రవారం ఒక అనుమానాస్పద ఘటన వెలుగుచూసింది. ఇంట్లో పాతిపెట్టిన...
By Pagadala Venkateswar 2026-03-21 06:09:55 0 219
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com