ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించిన కౌన్సిలర్ జాడి వినోద్ కుమార్ 1వ వార్డులో ముమ్మరంగా డ్రైనేజీ శుభ్రత పనులు

0
262

🎤ఆసిఫాబాద్, భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి:  ప్రజా సమస్యలే తన సమస్యలుగా భావిస్తూ, వార్డు అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న 1వ వార్డు కౌన్సిలర్ జాడి వినోద్ కుమార్ గారు మరోసారి తన చొరవను చాటుకున్నారు. 1వ వార్డు పరిధిలోని డ్రైనేజీలో గత కొంతకాలంగా చెత్త, మట్టి భారీగా పేరుకుపోవడంతో మురుగునీటి ప్రవాహానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనివల్ల పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తి, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గమనించిన ప్రజలు ఈ సమస్యను కౌన్సిలర్ జాడి వినోద్ కుమార్ గారి దృష్టికి తీసుకువెళ్లారు. ప్రజల వినతిపై తక్షణమే స్పందించిన ఆయన, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే రంగంలోకి దిగి జెసిబి (JCB) సహాయంతో డ్రైనేజీ శుభ్రపరిచే పనులను చేపట్టారు. డ్రైనేజీలో పేరుకుపోయిన మట్టిని, చెత్తను పూర్తిగా తొలగించి, మురుగునీరు ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా వెళ్లేలా తగిన చర్యలు తీసుకున్నారు. దీంతో పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య సమస్యలు తగ్గడంతో పాటు ప్రజలకు ఇబ్బందులు లేకుండా మార్గం సుగమమైంది. ప్రజల సమస్యలను విని వెంటనే స్పందించి, త్వరితగతిన పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్న కౌన్సిలర్ జాడి వినోద్ కుమార్ గారి చొరవపై స్థానిక వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Search
Categories
Read More
Telangana
అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు : మంత్రి వివేక్ వెంకటస్వామి
మంచిర్యాల జిల్లా : చెన్నూరు మండలం బావురావుపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఎగుడ శేఖర్ ఇందిరమ్మ గృహ...
By Avunoori Mahesh 2026-04-29 11:00:38 0 206
Andhra Pradesh
మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి.
మదనపల్లెలో గురువారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ను ఆర్టీసీ ఉద్యోగుల సంఘం...
By Pagadala Venkateswar 2026-06-26 03:13:20 0 84
Andhra Pradesh
Sub register get promotion to registarar.
ఏపీ లో *18 మంది సబ్ రిజిస్ట్రార్లకు జిల్లా రిజిస్ట్రార్లుగా పదోన్నతి*   రిజిస్ట్రేషన్,...
By G k Nookala 2026-02-18 09:56:22 0 203
Andaman & Nikobar Islands
Andaman & Nicobar's Sustainable Tourism Development Drive
The Andaman & Nicobar Islands are emphasizing sustainable tourism development in 2026 by...
By Fathima Safa 2026-06-16 12:42:10 0 211
Telangana
కన్నెత్తి చూడని మంత్రులు, అధికారులు ...
దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానాన్ని నిర్మించిన రామదాసును...
By Krishna Balina 2026-01-24 14:32:43 0 409
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com